తెలంగాణ

ఎస్సారెస్పీలోకి భారీగా వరద నీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, జూలై 13: రాష్ట్రంలోని భారీ ప్రాజెక్టులలో ఒకటైన శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుండి పెద్దఎత్తున వరద నీరు వచ్చి చేరుతుండడంతో రిజర్వాయర్ నీటిమట్టం గణనీయంగా పెరగుతోంది. 1091.00 అడుగులు, 90టిఎంసిల పూర్తిస్థాయి సామర్థ్యం కలిగిన ఎస్సారెస్పీలో, బుధవారం సాయంత్రం నాటికి 1060.30 అడుగులు, 13.91టిఎంసిల నీరు నిలువ ఉంది. ఉదయం నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు కూడా 73వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగగా, సాయంత్రం ఐదు గంటల సమయానికి ఇన్‌ఫ్లో కాస్తంత తగ్గుముఖం పడుతూ 59వేల క్యూసెక్కులకు చేరింది. మంగళవారం నాటి నుండి వర్షాలు నిలిచిపోవడంతో ఎగువన మహారాష్టల్రోని విష్ణుపురి ప్రాజెక్టు గేట్లను మూసివేశారు. అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలోని గడ్డెన్నవాగు నుండి వచ్చే వరద జలాలు సైతం నిలిచిపోయాయి. దీంతో బుధవారం మధ్యాహ్నం వరకు 73వేల క్యూసెక్కుల చొప్పున కొనసాగిన ఇన్‌ఫ్లో కాస్త, సాయంత్రం సమయానికి పలుచబడి 59వేల క్యూసెక్కులకు పరిమితమైంది. అయితే విష్ణుపురి గేట్లను బుధవారం మూసివేసినప్పటికీ, గురువారం మధ్యాహ్నం వరకు కూడా ఎస్సారెస్పీలోకి ఇన్‌ఫ్లో కొనసాగే అవకాశాలు ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. నేటి మధ్యాహ్నం వరకు 30వేల క్యూసెక్కుల చొప్పున ఇన్‌ఫ్లో వచ్చి చేరినా, ఎస్సారెస్పీ నీటిమట్టం మరో 3టిఎంసిల వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేకాకుండా స్థానిక నిజామాబాద్ జిల్లా రైతాంగానికి ప్రయోజనం చేకూర్చే లక్ష్మి కెనాల్ ద్వారా నీటిని విడుదల చేసేందుకు కూడా వెసులుబాటు ఏర్పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. లక్ష్మి కాలువ ద్వారా నీటిని విడుదల చేయాలంటే ఎస్సారెస్పీలో నీటిమట్టం 1064అడుగులు ఉంటేనే సాధ్యపడుతుంది. ప్రాజెక్టు నీటిమట్టం బుధవారం సాయంత్రం నాటికే 1060.30అడుగులు దాటడం, విష్ణుపురితో పాటు బాబ్లీ, దాని ఎగువన గల అంధురా ప్రాజెక్టుల నుండి మిగులు జలాలు వచ్చి చేరుతున్నందున గురువారం మధ్యాహ్నం నాటికి ఎస్సారెస్పీలో నీటిమట్టం 1064 అడుగులు, 17టిఎంసిలకు చేరుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.