తెలంగాణ

మొక్కలను నాటడమే కాదు..పెంచాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 13 : హరితహారం కార్యక్రమంలో నాటుతున్న మొక్కలను పెంచిపోషించాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ పేర్కొన్నారు. హరితహారంలో పాల్గొంటున్న వివిధశాఖల ఉన్నతాధికారులతో బుధవారం ఆయన సచివాలయంలో ప్రత్యేకంగా సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మొక్కలను నాటడం, ప్రచారం చేసుకోవడంతో ఈ కార్యక్రమం ముగిసిపోదని, నాటిన ప్రతిమొక్క ఏపుగా పెరిగేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. చెరువులు, కుంటల పరీవాహక ప్రాంతంలో, మొక్కలు నాటడంపై నీటిపారుదల, అటవీ శాఖాధికారులు సమన్వయంగా పనిచేయాలన్నారు. జిల్లాల్లో టేకుమొక్కలు కావాలంటూ ప్రజలు అడుగుతున్నారని, ఈ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుండి టేకు మొక్కలను తెప్పించాలని ఆదేశించారు. పళ్లమొక్కలను అవసరమైతే ప్రైవేట్ నర్సరీల నుండి తెప్పించాలని సూచించారు. పరిశ్రమ ఆవరణల్లో కూడా విరివిగా మొక్కలు నాటేలా చూడాలని సూచించారు. ఈ నెల 18న పురపాలక సంఘాలలో హరితహారం చేపడుతున్నామని మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి ఎంజి గోపాల్ ఈ సందర్భంగా తెలిపారు. హెచ్‌ఎండిఎ పరిధిలో ఈ పర్యాయం మూడుకోట్ల మొక్కలను పెంచామని హెచ్‌ఎండిఎ కమిషనర్ చిరంజీవులు తెలిపారు.
21 న 40 లక్షల మొక్కలు
ఈ నెల 21 న పంచాయితీరాజ్ రోడ్ల వెంట 40 లక్షల మొక్కలు నాటాలని పంచాయితీరాజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశారు జారీ చేశారు. బుధవారం జిల్లాలోని పంచాయితీరాజ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇప్పటికే ఒకకోటి పంతొమ్మిది లక్షల మొక్కలను ఒకేరోజు నాటి రికార్డు సృష్టించిన చరిత్ర పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు ఉందని గుర్తు చేశారు. అదే స్ఫూర్తితో ఈ నెల 21 న పంచాయితీరాజ్‌కు చెందిన 10 వేల కిలోమీటర్ల రోడ్ల వెంట 40 లక్షల మొక్కలను నాటాలని కోరారు.