తెలంగాణ

పల్లెల ప్రగతికి విద్యుత్ సంస్థల అధిపతుల విరాళాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 21: తెలంగాణ పల్లెల ప్రగతికి దాతలు ముందకు రావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపుకు విద్యుత్ సంస్థలు అధిపతులు ముందుకు వచ్చారు. విద్యుత్ సంస్థల ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు, దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ రఘుమారెడ్డి, ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ గోపాల్‌రావుస్పందించారు. జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు తన స్వగ్రామం వరంగల్ రూరల్ జిల్లా సంగెం మండలం పల్లారి గూడెంలో ఆయన సొంత ఖర్చులతో ఇంటింటికీ రెండు చొప్పున ప్లాస్టిక్ బుట్టలు అందించారు. ఇండ్ల నుంచి చెత్తను సేకరించడానికి ఆటో ట్రాలీని పంచాయతీకి బహుకరించారు. ఇదే గ్రామంలో కాటమయ్య దేవాలయ నిర్మాణానికిరూ. 4 లక్షలు విరాళం ప్రకటించిన విషయాన్ని తెలియచేశారు. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ గౌరవరం రఘుమారెడ్డి సొంత గ్రామం రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం అప్పారెడ్డిపల్లిలో వైకుంఠ ధామం నిర్మాణానికి సొంత భూమిని నుంచి అర ఎకరం భూమి ఉచితంగా ఇవ్వడానికి ముందకు వచ్చారు. ఇదే గ్రామంలో గతంలో రఘుమారెడ్డి కుటంబానికి చెందిన ఎకరం భూమిని విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి ఉచితంగా ఇచ్చారు. ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ అన్నమనేని గోపాల్‌రావు (వరంగల్) తన స్వగ్రామం సంగెం మండలం కాపుల కనపర్తిలో పచ్చదనం- పరిశుభ్రత కోసం లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చారు. సొంత గ్రామాలకు కొంత చేయాత ఇవ్వాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనకు స్పందించామన్నారు.