తెలంగాణ

అమర పోలీసు కుటుంబాలకు అండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 21: వీరమరణం పొందిన పోలీసు కుటుంబాలకు అండగా నిలుస్తామని, విధినిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసులకు ఎక్స్‌గ్రేషియాను అందిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర హోం శాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ తెలిపారు. హైదరాబాద్ గోషామహాల్‌లోని పోలీస్ స్టేడియంలో సోమవారం జరిగిన పోలీసుల అమరవీరుల సంస్మరణ కార్యక్రంలో పాల్గొని మంత్రి నివాళులర్పించారు. ఈ సందర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ శాంతి భద్రతలు లేకుంటే అభివృద్ది జరుగదని, సమాజంలో శాంతి, ప్రజలకు భద్రతల పరిరక్షణకు అవసరమైతే, ప్రాణత్యాగం చేయడానికి కూడా పోలీసులు వెనుకాడరని, అమరులైన పోలీసులు మనకు గుర్తుచేస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని నేర రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రేరణతో పోలీసు శాఖ తరపున శక్తి వంచన లేకుండా నిరంతరం కృషి జరుగుతుందని చెప్పారు. తీవ్రవాద హింసలో వీరమరణం పొందిన పోలీసు కానిస్టేబుళ్లకు, ఎక్స్‌గ్రేషియా 40 లక్షల రూపాయలు, హెడ్‌కానిస్టేబుల్ నుండి ఎస్‌ఐ వరకు 45 లక్షల రూపాయల, ఇన్‌స్పెక్టర్, డీఎస్పీ, అదనపు ఎస్పీ వరకు రూ.50 లక్షలు, ఎస్పీ నుండి ఆపై ఐపీఎస్ అధికారులందరికి కోటి రూపాయలు, హోంగార్డులకు 30 లక్షలు రూపాయాలు చెల్లించడం జరుగుతుందని వెల్లడించారు. అదే విధంగా వీరమరణం పొందిన అధికారి కుటుంబంలో భార్య లేదా భర్తకు వారు రిటైర్మెంట్ వరకు సర్వీసులో ఉన్నట్టుగానే భావించి జీతాన్ని తదనుగుణంగా ఇస్తున్నట్లు తెలిపారు. కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఇంటి స్థలం, పిల్లలకు ఉచిత విద్య, ఆరోగ్య భద్రత పథకం ద్వారా కుటుంబ సభ్యులకు ఉచిత వైద్య సదుపాయం, రైలు ప్రయాణంలో 75 శాతం రాయితీ, టీఎస్‌ఆర్టీసీలో ఉచిత బస్‌పాస్ సౌకర్యం, గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ స్కీమ్ ద్వారా, కానిస్టేబుల్ నుండి ఎఎస్‌ఐ వరకు 5లక్షలు, ఎస్‌ఐ నుండి ఇన్‌స్పెక్టర్ వరకు 10 లక్షలు, డీఎస్పీ నుండి అసిస్టెంట్ కమాండెంట్ వరకు 15 లక్షలు, ఆపైస్థాయి అధికారులందరికి రూ.25 లక్షలు మంజూరు చేయడం జరుగుతుందని హోం మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల భద్రతకు పెద్దపీట వేసిందని, రాష్ట్రంలో శాంతి భద్రతల పర్యవేక్షణ బాగుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల సీసీ కెమెరాలు అమర్చేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. రూ.400 కోట్లతో పోలీసు కమాండ్ కంట్రోల్ భవనంను అత్యదునిక హంగులతో నిర్మిస్తామని, దాదాపు 800 పోలీస్టేషన్‌లను కమాండ్ కంట్రోల్‌కు అనుసంధానం చేయడం జరుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో పాల్గొన్న డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ..విధి నిర్వహణలో ఉన్న పోలీసులు తమ కర్తవ్యాన్ని గుర్తుచేసుకోవాలని, పోలీసులు శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నారన్నారు. వరంగల్‌లో చిన్నారి అత్యాచార ఘటనకు సంబంధించిన కేసులో నిందితునికి 21 రోజుల్లో శిక్ష ఖరారైన విషయాన్ని డీజీ గుర్తు చేస్తూ ఈ కేసులో పోలీసుల కృషిని కొనియాడారు. పోలీసుల కోసం సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్నారు. పోలీసులు సేవా దృక్పథంతో ప్రజల మనసు గెలవాలని మహేందర్ రెడ్డి ఆకాంక్షించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్, అదనపు డీజీపీ స్వాతిలక్రతో పాటు పలువురు ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారు. అనంతరం హోం మంత్రి మహ్మద్ మహమూద్ అలీ డీజీపీ మహేందర్ రెడ్డి ఇతర అధికారులతో కలిసి గోషామహాల్ పోలీస్ స్టేడియంలోని పోలీసు అమర వీరులు స్థూపం వద్ద శ్రాద్ధాంజలి ఘటించారు.
*చిత్రం... పోలీసు అమరవీరులకు సెల్యూట్ చేస్తున్న హోం మంత్రి మహ్మద్ మహమూద్ అలీ