తెలంగాణ

వచ్చే ఎన్నికల కోసం ఇప్పటినుంచే అభ్యర్థులను వెతుకుతున్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 13: ‘రాబోయే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సమర్థులైన అభ్యర్థుల కోసం వెతుకుతున్నాం, మీరూ పోటీ పడండి..’ అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. బుధవారం ఆయన పార్టీ కార్యాలయంలో విలేఖరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ప్రతి లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల్లో చురుకైన నేతలను, కార్యకర్తలను గుర్తించి వారిని ప్రోత్సహిస్తామని అన్నారు. దీంతోపాటు వారు చేపట్టే వివిధ కార్యక్రమాలను ప్రతి మూడు నెలలకు ఒకసారి సమీక్షిస్తామని, ఎన్నికలు సమీపించినప్పుడు వారిలో మెరుగ్గా పని చేసిన నాయకుణ్ణి ఎంపీ లేదా ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపిక చేస్తామని ఆయన తెలిపారు. పార్టీ కోసం అంకితమైన భావంతో పని చేసే వారినే గుర్తించి టిక్కెట్లు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఎంపీ, ఎమ్మెల్యే సీట్ల కోసం పోటీ చాలా ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచే ఆసక్తిగల వారు పార్టీ కోసం పని చేస్తూ పోటీ పడాలని ఆయన సూచించారు. అస్సాం, హర్యానా రాష్ట్రాల్లో బిజెపి బలపడి అధికారాన్ని చేపట్టిన విధంగా తెలంగాణలోనూ పని చేస్తామని ఆయన తెలిపారు. 2019 ఎన్నికలకు పార్టీని సమాయత్తపరిచేందుకు రోడ్‌మ్యాప్ సిద్ధం చేస్తున్నామని అన్నారు.
ప్రజలు ఇప్పుడిప్పుడే సెంటిమెంట్ భ్రమల నుంచి వైదొలుగుతున్నారని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు రెండేళ్ళ హనీమూన్ ముగిసిందన్నారు. ఇక ప్రజా సమస్యలపై సర్కారును ఎండగడతామని ఆయన హెచ్చరించారు. కాగా, తెలంగాణలోని 32వేల పోలింగ్ బూత్‌లకు పార్టీ కమిటీలను నియమించనున్నట్లు ఆయన చెప్పారు. ఈ నెలాఖరుకు కనీసం 20 వేల కమిటీలు పూర్తవుతాయన్నారు. పార్టీని పోలింగ్ బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పటిష్టవంతం చేస్తామని ఆయన తెలిపారు. హైదరాబాద్‌లో ఉగ్రవాదులను ఎన్‌ఐఎ అరెస్టు చేస్తే ఉగ్రవాదులకు న్యాయ సహాయం చేస్తామని మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, లోక్‌సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ చెప్పినా, ప్రభుత్వం చర్య తీసుకోలేదని అన్నారు. మజ్లిస్-టిఆర్‌ఎస్‌ల మధ్య మిత్రత్వం ఉన్నందుకే రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకోలేదని ఆయన తెలిపారు. పైగా మజ్లిస్ వాదం ఏదైనా తమకు మిత్రపక్షమేనని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించడం దారుణమని ఆయన విమర్శించారు. మజ్లిస్ వ్యాఖ్యలకు నిరసనగా తాము సంతకాల సేకరణ చేపడతామని ఆయన చెప్పారు. ఇలాఉండగా ఎమ్మెల్యే రాజాసింగ్ అసంతృప్తితో ఉండడం గురించి విలేఖరులు ప్రశ్నించగా, అందరినీ కలుపుకుని పోతానని డాక్టర్ లక్ష్మణ్ సమాధానమిచ్చారు.