తెలంగాణ

గుడుంబా రహిత రాష్ట్రంగా తెలంగాణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 21: రాష్ట్రంలో గుడుంబా నిర్మూలనకు నిరంతరం కృషి చేస్తూ గుడుంబా రహిత రాష్ట్రంగా తెలంగాణను కొనసాగిస్తున్నందుకు అబ్కారీ సిబ్బందిని రాష్ట్ర అబ్కారీ శాఖ మంత్రి వీ.శ్రీనివాస్ గౌడ్ అభినందించారు.
అబ్కారీ శాఖ పాలసీకి సంభందించి ముందస్తు ప్రణాళికలో భాగంగా గత వారంలో నిర్వహించిన మద్యం టెండర్ల ప్రక్రియలో విజయవంతంగా, పారర్శకంగా నిర్వహించినందుకు అబ్కారీ శాఖ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం ఆధ్వర్యంలో మంత్రికి అభినందనలు తెలిపారు. సీఎం ఆదేశానుసారం రాష్ట్రంలో గీత కార్మికుల సంక్షేమం కోసం నీరా విధానాన్ని ప్రవేశపెడుతున్న సందర్భంగా గౌడ కులస్తుల తరపున మంత్రి శ్రీనివాస్ గౌడ్ కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆబ్కారీ గెజిటెడ్ అధికారుల సంఘం, టీజీవో సంఘం ప్రతినిధులు టీ.రవీందర్ రావు, ఏ.సత్యనారాయణ, అరుణ్ కుమార్, ఏ.శ్రీనివాస్ రెడ్డి, తమటం లక్ష్మణ్ గౌడ్, జీ.వెంకటేశంతో పాటు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
*చిత్రం... మంత్రిని అభినందిస్తున్న అబ్కారీ గజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు టీ రవీందర్ గౌడ్