తెలంగాణ

ప్రజాసంఘాల నిషేధంపై ఆగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 21: ప్రజాసంఘాల నిషేధంపై వామపక్ష, విప్లవ పార్టీలు, ప్రజాసంఘాలు ఆగ్రహం వ్యక్తంచేశాయి. ప్రభుత్వ తీరుకు నిరసనగా 23న నిర్బంధ వ్యతిరేక సభను సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించాలని నిర్ణయించాయి. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం అంటూ విప్లవ పార్టీలు పిలుపునిచ్చాయి. ప్రజాపోరాటాల ద్వారా పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజలపై అణచివేత పెరిగిపోయిందని, తెలంగాణ ఉద్యమ సంఘాలపైనా, ఉద్యమ కారులపైనా, తెలంగాణ విద్యార్థి సంఘాల పైనా అణచివేత తీవ్రమైందని వివిధ సంఘాల నేతలు ఆరోపించారు. రాజ్యాంగ పరిధిలో ప్రజాస్వామిక పద్ధతిలో పోరాడుతున్న 23 ప్రజాసంఘాలను నిషేధించినట్టు నగర కమిషనర్ ప్రకటించడం అన్యాయమని అన్నారు. అప్రజాస్వామికం కూడా అబద్దాలు ప్రచారం చేయడం ద్వారా ప్రజాసంఘాల ప్రతిష్టకు భంగం కలిగించడం కూడా అధికార దుర్వినియోగమేనని అన్నారు. న్యాయం కోసం పోరాడుతున్న అతిసామన్య ప్రజలపై, దళిత, ఆదివాసీలపై పోలీసుల వేధింపులు ఎక్కువయ్యాయని అన్నారు. బాధితులు ఇచ్చే ఫిర్యాదులను పోలీసులు, ఎమ్మార్వోలు, ఆర్డీవోలు స్వీకరించడం లేదని అన్నారు. బాధితుల తరఫున పోరాడుతున్న ప్రజాసంఘాల నాయకులపై పోలీసులు తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజల్లో వారి ప్రతిష్టను దిగజార్చుతున్నారని అన్నారు. కులదురహంకార హత్యలపై మాట్లాడటం నేరమా అని అని వారు ప్రశ్నించారు. దళిత మహిళలపై అత్యాచారాలను ఖండించడం తప్పా అని వారు పేర్కొన్నారు. భారత రాజ్యాంగం నేరాలుగా పరిగణించిన వాటి మీదనే తాము మాట్లాడుతున్నామని, భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను ఉపయోగించుకునే తాము పోరాడుతున్నామని, పోలీసులు మాత్రం రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని అన్నారు. ఈ విధానాలను అందరూ ఖండించాలని వారు పేర్కొన్నారు.