తెలంగాణ

మెదక్‌లో ‘నిమ్జ్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 14 : మెదక్ జిల్లాలో నేషనల్ ఇన్‌వెస్ట్‌మెంట్ అండ్ మాన్యుఫాక్చరింగ్ జోన్ (నిమ్జ్) ఏర్పాటు చేసేందుకు తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక వౌలికసదుపాయాల సంస్థ (టిఎస్‌ఐఐసి) కు ప్రభుత్వం అనుమతించింది. నిమ్జ్ ఏర్పాటు చేసేందుకు 12,635 ఎకరాల భూమి కావాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని కోరింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న మూడువేల ఎకరాల్లో స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్‌పివి) ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. మెదక్ నిమ్స్‌గా దీనికి పేరుపెట్టారు. టిఎస్‌ఐఐసి అధీనంలో ఉండే నిమ్జ్‌లో ఇండస్ట్రియల్ పార్క్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు పరిశ్రమల ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్ పేరుతో ఉత్తర్వులు జారీ అయ్యాయి.