తెలంగాణ

నేతన్నలకు చేయూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : రాష్ట్రంలోని చేనేత కార్మికులకు చేయూత ఇచ్చేందుకు ప్రభుత్వం తాజాగా 178 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ‘నేతన్నలకు చేయూత’ పథకం కింద ప్రభుత్వం 2019-20 సంవత్సరం బడ్జెట్‌లో 338 కోట్ల రూపాయలు కేటాయించి, తొలుత 150 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ప్రస్తుతం మరో 178 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ఇవి కాకుండా మరో 59 కోట్ల రూపాయలు విడుదల చేయాల్సి ఉంది. ఈ విషయంలో వెనుకబడిన తరగతుల కమిషనర్ అవసరమైన చర్యలు తీసుకోవాలని బీసీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి సీ. పార్థసారథి తెలిపారు.