తెలంగాణ

ముంపు బాధితుల సమస్యలపై అధ్యయనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 14: ముంపు ప్రాంతాల బాధితుల సమస్యలు, న్యాయపరమైన అంశాలపై అధ్యయనం చేయనున్నట్టు తెలంగాణ జెఎసి చైర్మన్ ప్రొ. కోదండరామ్ తెలిపారు. మల్లన్నసాగర్ ముంపు గ్రామాల్లో టిజెఎసి పర్యటించిందని, సదస్సులు నిర్వహించినట్టు చెప్పారు. పలువురు న్యాయవాదులు సైతం సదస్సుకు హాజరై న్యాయపరమైన అంశాలు వివరించారని చెప్పారు. సమస్యలు, న్యాయపరమైన అంశాలు అధ్యయనం చేసి నివేదిక విడుదల చేయనున్నట్టు చెప్పారు. ముంపు బాధితులను ఆదుకోవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉందన్నారు. మల్లన్న ప్రాజెక్టుపై సంపూర్ణంగా అధ్యయనం చేసి నివేదిక రూపొందించనున్నట్టు చెప్పారు.
21, 22న పాలమూరు ప్రాజెక్టుల సందర్శన
మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన పలు ప్రాజెక్టులపై టిజెఎసి అధ్యయనం చేయనున్నట్టు చెప్పారు. ఈనెల 21, 22 తేదీల్లో మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించి ప్రాజెక్టులపై సంపూర్ణ అధ్యయనం చేయనున్నట్టు చెప్పారు. జిల్లా టిజెఎసితో కలిసి జిల్లాలోని ప్రాజెక్టులను పరిశీలించనున్నట్టు కోదండరామ్ తెలిపారు. నాంపల్లిలోని టిజెఎసి కార్యాలయంలో గురువారం టిజెఎసి స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్రంలో నిర్మిస్తున్న ప్రాజెక్టులు, ముంపు బాధితుల సమస్యలపై విస్తృతంగా చర్చించారు. మల్లన్నసాగర్ ముంపు గ్రామాలకు సంబంధించి మరో రెండు మూడు గ్రామాల్లో పర్యటించనున్నట్టు చెప్పారు.