తెలంగాణ

యాదాద్రి నుంచి వరంగల్ వరకు నాలుగు లేన్ల జాతీయ రహదారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, జనవరి 3: రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, కేంద్ర రోడ్లు, భవనాల శాఖమంత్రి నితిన్‌గడ్కరీ నేడు (సోమవారం) వరంగల్‌కు రానున్నారు. రూ.1905 కోట్లతో యాదాద్రి నుండి వరంగల్ వరకు నిర్మించనున్న నాలుగు లైన్ల జాతీయ రహదారి పనులకు వారు శంకుస్థాపన చేస్తారు. దీంతో పాటే ఏటూరునాగారం గోదావరి తీరాన నిర్మామై ఉన్న ముళ్లకట్ట బ్రిడ్జిని వారు మడికొండ వద్దే జాతికి అంకితం చేయనున్నారు.
ఈ బ్రిడ్జి ద్వారా తెలంగాణ, చత్తీస్‌గడ్, మహారాష్టల్రకు రవాణామార్గం మెరుగుపడనుంది. ఇప్పటికే ఈ రెండు అభివృద్ధి పనులు వివిధ కారణాలతో రెండుసార్లు వాయిదా పడ్డాయ. ముఖ్యమంత్రి కెసిఆర్, కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీ రాక సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బహిరంగసభ కూడా ఏర్పాటు చేశారు. ముళ్లకట్ట బ్రిడ్జి ప్రారంభం, జాతీయ రహదారులకు శంకుస్థాపన అనంతరం బహిరంగసభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
ఈ కార్యక్రమం ముగియగానే ప్రత్యేక హెలికాప్టర్‌లో కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీ ఢిల్లీకి వెళ్లిపోతారని అధికారులు తెలిపారు. అయితే సిఎం కెసిఆర్ మాత్రం వరంగల్‌లోనే ఉండి ఆ మరుచటి 5న కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టు (కెటిపిపి) విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించి అదేరోజు సాయంత్రం మేడారం జాతర ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించనున్నారు. అధికారికంగా సిఎం పర్యటన రెండు రో జులు మాత్రమే ఖరారు కాగా మరోరోజు కూడా పొడిగింపు అయ్యే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు చెపుతున్నాయి.

విదేశీ పెట్టుబడుల కోసం వెంపర్లాట
మోదీ, కెసిఆర్‌లపై సిఐటియు జాతీయ కార్యదర్శి సుధాభాస్కర్ ధ్వజం

ఆంధ్రభూమి బ్యూరో
సంగారెడ్డి, జనవరి 3: ఎన్నికల సమయంలో స్వదేశం అంటూ అభిమానం చూ పించిన ప్రధాని మోదీ అధికారంలోకి రాగానే విదేశీ పెట్టుబడులను ఆశిస్తూ స్వదేశీ ఉత్పత్తులకు తిలోదకాలిస్తున్నారని, కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కెసిఆర్ పాలన తీరు దొందూ దొందుగానే ఉన్నా యని సిఐటియు జాతీయ కార్యదర్శి సుధాభాస్కర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మెదక్ జిల్లా సంగారెడ్డిలోని బాలాజీ మంజీర గార్డెన్‌లో ఆదివారం సిఐటియు 11వ జిల్లా మహాసభలను నిర్వహించారు. ఈ సభలకు ముఖ్య అతిథిగా హాజరైన సుధాభాస్కర్ ప్రారంభోపన్యాసం చేసారు. గత యేడాది సెప్టెంబర్ 2న దేశ వ్యాప్తంగా సార్వత్రిక సమ్మె నిర్వహించిన అనంతరం కేంద్ర ప్రభుత్వం మరింత వేగంగా 15 రంగాల్లో ఎఫ్‌డిఐలను పెంచుతూ నిర్ణయం తీసుకోవడం విచారకరమన్నారు. గత ప్రభుత్వాలతో పోల్చుకుంటే ఎన్డీయే ప్రభుత్వం పెట్టుబడిదారులకు కొమ్ముకాస్తోందని విమర్శించారు. దశాబ్దాల పోరాటాలతో సాధించుకున్న కార్మిక చట్టాలను సవరించి కార్మిక లోకం నడ్డివిరుస్తోందని ఆవేదన వ్యక్తం చేసారు. త్వరలోనే ప్రపంచ దేశాలతో పాటుగానే భారతదేశం పెద్ద ప్రమాదాన్ని ఎదుర్కోబోతోందని, దీన్ని కార్పొరేట్ డెట్‌గా అభివర్ణించారు. 2015 నాటికి కార్పొరేట్ సంస్థల అప్పు లక్ష కోట్ల డాలర్లకు చేరిందని, వీటిలో ఏ ఒక్కరు ఐపి తీసుకున్నా బ్యాంకులు నిలువునా మునుగుతాయని హెచ్చరించారు. దీంతో ప్రజాజీవనం తలకిందులయ్యే ప్రమాదం ఉందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విదేశీ పెట్టుబడులు వస్తాయని ప్రశ్నించారు. ధనిక, పేద వర్గాల మధ్య అంతరం మరింత పెరుగుతుందన్నారు. 2014 సంవత్సరంలో 85 మంది మల్టీ మిలియనీయర్ల సంపద 350 కోట్ల ప్రజా ఆస్తులతో సమానం అనుకుంటే యేడాది కాలంలోనే 80 మంది ఆస్తి 350 కోట్ల ప్రజా ఆస్తులతో సమానమైందన్నారు. ప్రపంచం సంక్షోభాన్ని ఎదుర్కొంటే పెట్టుబడులు ఏవిధంగా వస్తాయని ప్రశ్నించారు. దేశ కార్మికులపై మూడు రకాల దాడులు యథేచ్ఛగా జరుగుతున్నాయని,చట్టాల సవరణ, సంఘాల్లో సభ్యత్వ నమోదును నిలువరించేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.