తెలంగాణ

సర్కార్ లెక్కలన్నీ బోగస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన లెక్కలు బోగస్సు అని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ఆరోపించారు. ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో మంగళవారం విచారణ వాయిదా పడిన తర్వాత ఆశ్వత్తామరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, హైకోర్టును కూడా రాష్ట్ర ప్రభుత్వం తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తుందని విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలో 2009 నుంచి 2014 వరకు ఆర్టీసీకి రూ.1099 కోట్లు బకాయి పడిందన్నారు. ఆ తర్వాత 2014 నుంచి 2019 వరకు బస్ పాసులపై రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రాయితీలకు సంబంధించి మరో రూ.1375 కోట్లు బకాయిపడిందన్నారు. అలాగే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) ఆర్టీసీకి రూ.1496 కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. వీటన్నింటిని తమ తరఫు న్యాయవాది కోర్టులో ప్రస్తావిస్తే మంగళవారం హైకోర్టుకు వివరాలు సమర్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చి అవ్వేమి ఇవ్వకుండా ఆర్టీసీకి బకాయిపడిన దాని కంటే ఎక్కువే ఇచ్చామంటూ ప్రభుత్వం కోర్టును తప్పుదోవ పట్టించాలని చూసిందని అశ్వత్థామరెడ్డి ఆరోపించారు. ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు అఫిడవిట్ దాఖలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆర్టీసీ సమ్మె సంపూర్ణంగా కొనసాగుతుందని, కార్మికులు ఎవరూ అధైర్యపడవద్దని అశ్వత్థామరెడ్డి పిలుపునిచ్చారు.
*చిత్రం... విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న అశ్వత్థామ రెడ్డి