తెలంగాణ

ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ఖరారు కానున్న ఫీజులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 15: తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ఎంబిబిఎస్, డెంటల్ కోర్సులకు సంబంధించి ఫీజులు త్వరలో ఖరారు చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను వెంటనే సమర్పించాలని తెలంగాణ అడ్మిషన్లు, ఫీజుల రెగ్యులేటరీ కమిటీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 25వ తేదీ నుండి 27వ తేదీ మధ్య వివిధ కాలేజీల ఫీజులను నిర్ధారించనున్నారు. ఇందుకోసం కాలేజీల యాజమాన్యాలు తమ ఖర్చులు, ఆదాయం, సిబ్బంది, వారికి చెల్లిస్తున్న జీత భత్యాలు, నిర్వహణ వ్యయం, వౌలిక సదుపాయాల కల్పన వ్యయంపై సమగ్రమైన నివేదికలను ఈ నెల 20వ తేదీలోగా సమర్పించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి సిబ్బంది పాన్ కార్డుల నెంబర్లు కూడా ఇవ్వాలని సూచించింది. నివేదికలు ఇవ్వని కాలేజీల్లో ఫీజులు నిర్ధారించడం కుదరదని, ఫీజుల నిర్ధారణ కాకుంటే అడ్మిషన్లు చేపట్టడానికి వీలుండదని కూడా ఎఎఫ్‌ఆర్‌సి పేర్కొంది.