తెలంగాణ

ప్రతి ఎమ్మెల్యే ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, జూలై 15: ప్రతి ఎమ్మెల్యే ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దాలని.. శాసనసభలో తీర్మానం చేయాలని తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ సూచించారు. ఇబ్రహీంపూర్ గ్రామం తెలంగాణ రా ష్ట్రానికి చిహ్నం అని కొనియాడారు. ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాన్ని పచ్చదనం, పరిశుభ్రత, దోమలు లేని గ్రామాంగా తీర్చిదిద్దటం అభినందనీయమన్నారు. హైదరాబాద్ రాజ్‌భవన్‌లో దోములున్నాయని.. మారుమూ ల గ్రామమైన ఇబ్రహీంపూర్‌లో దో మలు లేక పోవటం తనను ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. శుక్రవారం మెదక్ జిల్లా సిద్దిపేట మండలం ఇబ్రహీంపూర్‌లో హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటడంతో పాటు.. గ్రామంలో ఆదర్శంగా తీర్చిదిద్దిన ఇంకుడుగుంతలు, ఇంటింటికీ నల్లా, ఎల్‌ఇడి లైట్లను పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్ మాట్లాడుతూ హైదరాబాద్ నగారాల్లో ఉండే సౌకర్యాలు గ్రామాలకు రావాలన్నారు. ఇబ్రహీంపూర్ గ్రామాన్ని చూసి ఎంతో నేర్చుకున్నానన్నారు. నగరాలు, పట్టణాల ప్రజలు ఇబ్రహీంపూర్ గ్రామాన్ని చూసి ఎంతో నేర్చుకోవాలన్నారు. అన్ని రంగాల్లో ఆదర్శంగా ఉన్న ఇబ్రహీంపూర్ గ్రామం కాదని.. గొప్ప నగరమైందని, తెలంగాణ రాష్ట్రానికి సింబల్‌గా మారిందన్నారు. అన్ని సౌకర్యాలు సమకూర్చుకోని స్వర్ణ గ్రామమైందని.. స్వర్ణ గ్రామాలను తయారు చేస్తే స్వర్ణ తెలంగాణ సాధ్యమవుతుందన్నారు. పట్టణాలు చెట్లు లేక కాంక్రీట్ నేలలుగా మారాయన్నారు. హైదరబాద్ నగరంలో 10 రకాల మొక్కలు పెడితేనే ఇంటి నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని జిహెచ్‌ఎంసిలో నిర్ణయం తీసుకున్నారన్నారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, పట్టణాల్లో సైతం చెట్లు నాటితేనే ఇంటి నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని ని బంధన విధించాలని స్పష్టం చేశారు. ఇబ్రహీంపూర్ అభివృద్ధి ఒక్కరోజులో జరిగిన అభివృద్ధి కాదని.. ప్రజల భాగస్వామ్యంతో కొనే్నళ్లుగా సమష్టి గా కృషిచేయటం వల్ల సాధ్యమైందన్నారు. గ్రామంలోని రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, ఇంకుడుగుంతలు, ఉపాధి హామీ పనులు, పాఠశాల, పచ్చని చె ట్లు ఎంతో చక్కగా ఉన్నాయని.. ఇక్క డి వాతావరణం ఏంతో మంత్రముగ్దుల్ని చేస్తుందన్నారు. తన జీవితంలో ఇబ్రహీంపూర్ గ్రామాన్ని సందర్శించటం ఏంతో సంతోషకరమైన రోజన్నారు. ఇబ్రహీంపూర్ గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేసిన మంత్రి హరీశ్‌రావును, కలెక్టర్‌ను రోనాల్డ్‌రోస్‌పై ప్రశంసలు కురిపించారు. గ్రామంలో సోలార్ సౌకర్యం సమకూర్చుకోవాలని సూచించారు. సౌర విద్యుత్ సౌకర్యం గ్రామ అభివృద్ధికి మరింత దోహదం చేస్తుందన్నారు. ఈకార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎంపిలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్, ఎమ్మెల్యే రామలింగారెడ్డి, ఎమ్మెల్సీలు ఫారూక్‌హుస్సేన్, సుధాకర్‌రెడ్డి, కలెక్టర్ రోనాల్డ్‌రాస్, సిఎంఓ ఓఎస్‌డి ప్రియాంక నర్గీస్, డిఆర్‌డిఎ పిడి సత్యనారాయణరెడ్డి, ఆర్డీఓ ముత్యంరెడ్డి, ఓఎస్‌డి బాలరాజు, జడ్పీ వైస్ చైర్మన్ సారయ్య, ఎంపిపి యాదయ్య, సర్పంచ్ లక్ష్మిరాఘవారెడ్డి, నాయకులు ఏల్లారెడ్డి, నగేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న గవర్నర్ నరసింహన్, డప్పు వాయిస్తున్న గవర్నర్