తెలంగాణ

తహశీల్దార్ హత్యతో కదిలిన యంత్రాంగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 5: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ విజయారెడ్డి హత్యతో రెవెన్యూ యంత్రాంగం ఉలిక్కిపడింది. మునుపెన్నడూ కనీవిననీ సంఘటన చోటు చేసుకోవడంతో ఉద్యోగ సంఘాలన్నీ ఏకమై తమకు రక్షణ కల్పించాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. తహశీల్దార్ విజయారెడ్డి అంత్యక్రియల్లో పాల్గొనడానికి రెవెన్యూ ఉద్యోగులు, సిబ్బంది, ఇతర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హైదరాబాద్ ఆర్కేపురంలోని ఆమె నివాసానికి మంగళవారం ఉదయం తరలివచ్చారు.
వారంతా శవయాత్రలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమకు రక్షణ కల్పించాలనే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ శవయాత్ర పొడవునా నినాదాలతో నాగోల్‌లోని స్మశాన వాటికకు చేరుకునే వరకు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
*చిత్రం...ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తిన విజయారెడ్డి శవయాత్ర