తెలంగాణ

ఔటర్ రింగ్ రోడ్డు రాజధానికి మణిహారం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 15: హైదరాబాద్ చుట్టూ ఉన్న 158 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు నగరానికి మణిహారమని మున్సిపల్, ఐటి శాఖ మంత్రి కె. తారక రామారావు అన్నారు. శుక్రవారం ఘట్‌కేసర్ అన్నోజిగూడ వద్ద నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డును రవాణా శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి టి.పద్మారావులతో కలిసి ప్రారంభించారు. ఘట్‌కేసర్ నుంచి శామీర్‌పేట్ వెళ్లే రోడ్డు సుమారు 21.3కి.మీటర్ల పొడవు ఉందన్నారు. నగరం చుట్టూ 158 కిలో మీటర్ల ఔటర్ రింగ్ రోడ్డును నిర్మించాల్సి ఉండగా ఇప్పటి వరకు 156.9 కిలో మీటర్ల రోడ్డును ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. మరో కిలోమీటర్ రోడ్డు పనులు కోర్టు కేసు వల్ల జాప్యం జరిగినప్పటికీ దాన్ని కూడా పూర్తి చేసి వినియోగంలోకి తెస్తున్నట్లు పేర్కొన్నారు. వంద రోజుల అజెండాలో భాగంగా ఘట్‌కేసర్-శామీర్‌పేట్ రింగ్ రోడ్డు పనులు పూర్తి చేయాల్సి ఉండగా, దాన్ని సకాలంలో పూర్తిచేసిన హెచ్‌ఎండిఎ అధికారులను అభినందించారు. భవిష్యత్‌లో రింగ్ రోడ్డు పైన ట్రాఫిక్ నియంత్రణ కోసం టోల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను ట్రాన్సిట్ ఓరియెంటెడ్ గ్రోత్ కారిడార్స్ ప్రవేశపెడుతామని పేర్కొన్నారు. పదివేల మొక్కలను నాటి హరిత తెలంగాణ సాధనలో హెచ్‌ఎండిఎ భాగస్వామ్యమవుతుందని కెటిఆర్ తెలిపారు.