తెలంగాణ

ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 16: ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లోని విద్యుత్ సంస్థల ఉద్యోగుల పంపకం సాఫీగా జరగాలంటే హైకోర్టు ప్రత్యేక కమిటీని నియమించాలని జస్టిస్ ధర్మాధికారి కమిటీ హైకోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొంది. ఈ సంస్థల ఉద్యోగుల పంపకంపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని హైకోర్టు జస్టిస్ ధర్మాధికారి కమిటీని గతంలో నియమించింది. రెండు రాష్ట్రాల విద్యుత్ సంస్థలకు ఎంత మంది ఉద్యోగులు అవసరమో ముందుగా నిర్ధారించాలని ఈ కమిటీ నివేదికలో పేర్కొంది. అనంతరం ఉద్యోగులు చదువుకున్న ప్రాంతం, సొంత జిల్లా, ఇతర వివరాలను పరిగణనలోకి తీసుకుని ఒక విధానాన్ని ఉమ్మడిగా ఖరారు చేసి ఉద్యోగుల పంపకాలను చేపట్టాలని సూచించింది. వితంతువులైన, విడాకులు పొందిన మహిళా ఉద్యోగినుల విషయంలో వారి అభిప్రాయాలు, ఆప్షన్లకు ప్రాధాన్యత ఇవ్వాలని ఈ కమిటీ సిఫార్సు చేసింది.