తెలంగాణ

ఎమ్మెల్యే ‘సై’ అంటేనే షాదీ ముబారక్ నిధుల విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 16 : ముస్లిం మహిళల పెళ్లిల్లకోసం ఉద్దేశించిన ‘షాదీ ముబారక్’ పథకం ఇక నుండి ఎమ్మెల్యేల చేతుల్లోకి వెళుతోంది. శనివారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ పథకం కింద వచ్చే దరఖాస్తులను ఇక నుండి తహశీల్‌దార్లు ప్రాసెస్ చేసి, సరిగ్గా ఉన్నాయో లేదో పరిశీలిస్తారు. ముస్లింలలో పేదవర్గాలకు చెందిన మహిళల వివాహాలకోసం ప్రభుత్వం 51 వేల రూపాయలు ఇస్తోంది. ఇప్పటి వరకు ప్రాసెస్‌చేసే అధికారం మైనారిటీ సంక్షేమ శాఖాధికారులకు ఉండేది. తహశీల్‌దార్ల పరిశీలన తర్వాత ఈ జాబితాలను సంబంధిత ఎమ్మెల్యే ఆమోదించాల్సి ఉంటుంది. ఎమ్మెల్యే ఆమోదం తర్వాత జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖాధికారి చెక్కులను తయారు చేయాల్సి ఉంటుంది. ఈ చెక్కులను వారానికి ఒక పర్యాయం లబ్దిదారులకు ఎమ్మెల్యేలు పంపిణీ చేయాలని ఆదేశాలు జారీచేశారు.