తెలంగాణ

ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను వెనక్కి రప్పించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 10: ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను తెలంగాణకు రప్పించాలని తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ (టీఈఎ) డిమాండ్ చేసింది. టీఈఏ రాష్ట్ర అధ్యక్షుడు సంపత్ కుమార స్వామి అధ్యక్షతన టీఈఏ రాష్ట్ర కార్యకర్గ సమావేశం ఆదివారం ఇక్కడ జరిగింది. ఈ సమావేశంలో పలు తీర్మానాలను ఆమోదించామని సంపత్ కుమార్ తెలిపారు. ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను వెంటనే తెలంగాణ రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని, పీఆర్‌సీని వెంటనే ప్రకటించాలని, సీసీఎస్‌ను రద్దు చేస్తూ, పాత పింఛన్ విధానాన్ని పునరుద్దరించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు టీఈఏ మద్దతు తెలిపింది. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 నుండి 61 సంవత్సరాలకు పెంచాలని, ఉద్యోగులకు విధినిర్వహణలో భద్రత కల్పించాలని, ఉద్యోగులందరికీ పరిమితి లేని వైద్య సౌకర్యం కల్పించాలని కోరారు.

*చిత్రం...సమావేశంలో మాట్లాడుతున్న సంపత్ కుమార స్వామి