తెలంగాణ

ఆ పార్టీయే లేదు, ఏం స్పందించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 16: ‘ఆ పార్టీ లేదు, లేని పార్టీ నేత చేసిన వ్యాఖ్యలపై ఏమని స్పందించాలి..’ అని బిజెపి శాసనసభాపక్షం నాయకుడు జి. కిషన్ రెడ్డి పరోక్షంగా తెలుగు దేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై చిట-పటలాడారు. పట్టుబడిన ఉగ్రవాదులకు న్యాయ సహాయం అందిస్తామని మజ్లిస్ నేత, లోక్‌సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ చేపడతామని కిషన్ రెడ్డి శనివారం పార్టీ ఎమ్మెల్యే ఎన్‌విఎస్‌ఎస్ ప్రభాకర్, నగర పార్టీ అధ్యక్షుడు వెంకట్‌రెడ్డితో కలిసి విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ చెప్పారు. టిఆర్‌ఎస్‌కు టిడిపి, కాంగ్రెస్ పార్టీలు అనుబంధ సంఘాలుగా మారాయని, ఇక పార్టీలు ఉండి ప్రయోజనం ఏమిటని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల గురించి ప్రశ్నించగా, ఆ పార్టే లేదు, ఏమని స్పందించాలని ఆయన దాట వేశారు. తమ పార్టీ ఒంటరిగానే ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తున్నదని ఆయన తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిథిలోని సమస్యలపై ఉద్యమించనున్నట్లు ఆయన చెప్పారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా మారుస్తామని ప్రభుత్వం చెప్పడాన్ని ఆయన ప్రస్తావిస్తూ విశ్వనగరం కాదు విషాద నగరంగా మార్చారని విమర్శించారు.