తెలంగాణ

భద్రాచలం అభివృద్ధికి కృషి చేసిన నిజాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 16: తెలంగాణ రాష్ట్రానికి భద్రాచలం దక్కడానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని ఎఐసిసి నాయకుడు, ఎంపి జైరాం రమేశ్ అన్నారు. నాడు భద్రాచలంను అభివృద్ధి చేసేందుకు నిజాం కృషి చేసినందుకు, దేవస్థానానికి కేర్‌టేకర్‌గా ఉన్నందుకే తెలంగాణకు కేటాయించడం జరిగిందని ఆయన తెలిపారు. నిజాంకు మొగల్ చక్రవర్తులు-బ్రిటీషుల మధ్య కాలం నాటి పరిస్థితులపై డాక్టర్ వసంత్‌కుమార్ భవ రాసిన పుస్తకాన్ని జైరాం రమేశ్ శనివారం ఇక్కడి హిమాయత్‌నగర్‌లోని ఉర్దూ హాలులో జరిగిన కార్యక్రమంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జైరాం రమేశ్ ప్రసంగిస్తూ భద్రాచలం రెవెన్యూ డివిజన్ ఆంధ్రప్రదేశ్‌కు దక్కినా, శ్రీసీతారామచంద్ర స్వామి భద్రాచలం దేవస్థానం తెలంగాణకు దక్కిందని అన్నారు. అందుకు కారణం భద్రాచలాన్ని అభివృద్ధి చేసేందుకు నిజాం కృషి చేశారని, అక్కడి వారితో నిజాం మంచి సంబంధాలు నెలకొల్పారని ఆయన తెలిపారు. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రానికి తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ అని కలిపి పేరు పెట్టాలనుకున్నారని ఆయన చెప్పారు. అయితే కొన్ని కారణాల వల్ల కేవలం ఆంధ్రప్రదేశ్‌గానే పెట్టడం జరిగిందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరగడానికి తానే కారణమని కొంత మంది అంటున్నారని, నిజానికి రాజకీయ కారణాల వల్లే విభజన జరిగిందని ఆయన తెలిపారు. హైదరాబాద్ వెళుతున్నానని తన మిత్రులకు చెబితే ‘వీసా’ తీసుకున్నారా? అని సెటైర్లు వేస్తున్నారని ఆయన నవ్వుతూ చెప్పారు.