తెలంగాణ

మల్లన్న సాగర్‌పై వర్రీ వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, జూలై 16: ఎవరి భూములకో నీరందించడానికి నీటి వనరులతో పంటలు పండించుకునే భూములను ముంపునకు గురి చేస్తూ మల్లన్న సాగర్ రిజర్వాయర్ నిర్మాణాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించేది లేదని, ఎన్ని పోరాటాలకైనా తామంతా మీ ముందుంటామని జాతీయ విపత్తుల నివారణ సంస్థ మాజీ చైర్మన్ మర్రి శశిధర్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం నాడు మెదక్ జిల్లా కొండపాక, తొగుట మండలాల పరిధిలోని ఎర్రవల్లి, పల్లెపహాడ్, శింగారం, వేములగట్, ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామాలను సందర్శించి దీక్షలకు సంఘీభావం వ్యక్తం చేసారు. ఆయన మాట్లాడుతూ బంగారు తెలంగాణ చేస్తానంటూనే ముంపు తెలంగాణకు శ్రీకారం చుట్టారని ఆగ్రహం వ్యక్తం చేసారు. 40 సంవత్సరాల క్రితం హర్యానా రాష్ట్రంలో యమునా నదిపై ఎత్తిపోతల పథకం ద్వారా ప్రాజెక్టులను నిర్మించి లక్షలాది ఎకరాలకు సాగునీటిని అందిస్తున్నారని సూచించారు. వేలాది ఎకరాల భూములను ముంపునకు గురి చేస్తే రైతులకు మిగిలేది ఏమిటని ఆయన ప్రశ్నించారు. సాగునీరు అందించాలనే చిత్తశుద్ధి సిఎం కెసిఆర్‌కు ఉంటే హర్యానాలోని సాగునీటి వనరులను పరిశీలించి అదే తరహాలో చేపడితే ఎవరికి అభ్యంతరం లేదన్నారు. అలాంటి ప్రాజెక్టులను చేపడితే కావల్సిన కొద్దిపాటి భూములను రైతులు ఆనందంగా సమకూరుస్తారన్నారు. తెలంగాణ రాష్ట్రానికి సాగునీరు కావాలని మూడు దశాబ్దాల క్రితమే తన నాన్న, మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి సూచించారని అన్నారు. కానీ సాగునీటిని అందించే విధానం ఇదికాదన్నారు. మల్లన్న సాగర్ ముంపు గ్రామాల ప్రజలు పడుతున్న ఆవేదనను ఇటీవలే తాను ఢిల్లీ వెళ్లి ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి వివరించానని, ప్రజలంతా ధైర్యంగా ఉండాలన్నారు. పోలీసులు వస్తున్నారని భయపడవద్దని, పోలీసులను కూడా ఎదుర్కోవడానికి మేమంతా మీ ముందుంటామన్నారు. ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపివేయించడానికి అవసరమైతే సుప్రీం కోర్టుకు కూడా వెళతామన్నారు.

చిత్రం.. కొండపాక మండలం ఎర్రవల్లి గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్న కాంగ్రెస్ నేత మర్రి శశిధర్‌రెడ్డి