తెలంగాణ

అసెంబ్లీ ఎన్నికల్లో దొరికిన నగదు 84.36 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: శాసనసభ ఎన్నికల్లో కోడ్ అమలులో ఉన్న సమయంలో జప్తు చేసిన డబ్బుకు సంబంధించి వివరాలు సేకరించి విశే్లషిస్తే ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయయని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రకటించింది. తెలంగాణలో 640 సందర్భాల్లో మొత్తం రూ.84.36 కోట్ల డబ్బు పట్టుబడగా, కేవలం 159 కేసుల్లో 28.27 కోట్ల డబ్బు పట్టుబడినట్లు పోలీసులు పేర్కొన్నారు. మొత్తం పట్టుబడిన కేసుల్లో 24 శాతం సందర్భాల్లో మాత్రమే ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేశారు. మిగిలిన రూ.56.09 కోట్ల డబ్బును వాపసు చేశారని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి ఎం పద్మనాభ రెడ్డి చెప్పారు. ఎన్నికల సందర్భాల్లో డబ్బు పాత్రను తగ్గించేందుకు ఎన్నికల కమిషన్ చేపట్టే చర్యలు రాష్ట్రంలో సరైన ఫలితాలు ఇవ్వలేదన్నారు. కోడ్ అమలులో ఉన్న సమయంలో ప్రతి రోజూ ప్రతి ఓవరుకు స్కోరు చెప్పనట్లు ప్రతి దినం పట్టుకున్న డబ్బు వివరాలను చెప్పేవారన్నారు. ఇప్పటి నుంచైనా పట్టుకున్న డబ్బు విచారణ పూర్తయిన తర్వాత కేసు నమోదు వివరాలు వెల్లడించాలన్నారు.
ఆదిలాబాద్ జిల్లా జైనత్ పోలీసు స్టేషన్‌ల కర్నాటక నుంచి తెస్తున్న రూ.10 కోట్లను జప్తు చేశారన్నారు. స్థానికంగా కేసు నమోదు చేసి ఆదాయం పన్ను శాఖకు ఇచ్చారన్నారు. ఈ రెండు కేసులు ఈడీ పరిధిలోకి వస్తాయన్నారు.
కొన్ని సందర్భాల్లో జప్తు చేసిన డబ్బు బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లుగా ఉంచారన్నారు. ఖమ్మం జిల్లా బోనకల్ పీఎస్ పరిధిలో రూ.49 లక్షల డబ్బు ఖమ్మం టీడీపీ ఆఫీసుకు తరలిస్తుండగా పట్టుబడిందన్నారు. ఎస్‌బీఐ బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ కింద ఉంచారన్నారు. బోనకల్ పీఎస్‌లో రూ.14.96 లక్షల డబ్బు జప్తు చేసి కేసు నమోదు చేసి ఎస్‌బీఐ బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశారన్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు తమకు డబ్బు ఇచ్చి గ్రామాల్లో పంచమన్నారు. అందుకు ఈ డబ్బును తామే తీసుకెళుతున్నామని నేరస్థాలు తమ వాంగ్మూలం ఇచ్చిన సంబంధిత అభ్యర్థులపై ఎటువంటి కేసులు నమోదు చేయలేదన్నారు. పట్టుబడిన సొమ్ములో చాలా మటుకు ఐటీ శాఖకు బదలాయించారన్నారు. ఐటీ శాఖ పట్టుకున్న డబ్బు నల్లధనమా, తెల్లధనమా అనే విషయాన్ని మాత్రమే చూస్తుందన్నారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు తెచ్చిన డబ్బా , కాదా అని విచారించదన్నారు. ఖమ్మం జిల్లా ఖానాపూర్‌లో హవేలీ పీఎస్‌లో రూ.10లక్షలు, సైబరాబాద్‌లోని శంషాబాద్ పీఎస్ పరిధిలో రూ.17.36 లక్షలు, నల్లగొండ జిల్లా వడ్డేపల్లి పీఎస్‌లో రూ.24 లక్షలు, ఆదిలాబాద్ ఒన్‌టౌన్ పీఎస్ పరిధిలో రూ.81 లక్షలు పట్టి కేసు నమోదు చేయలేదన్నారు. భద్రాద్రి జిల్లా దమ్మపేట పీఎస్ పరిధిలో ముగ్గురు వ్యక్తుల నుంచి రూ.1650 పట్టుకుని ముగ్గురిపై, గద్వాల్ రూరల్ పీఎస్ పరిధిలో రూ.500 కలిగి ఉన్నందున ఒక కేసును, అశ్వాపురం పీఎస్ పరిధిలో ఇద్దరు వ్యక్తుల నుంచి రూ.4వేల జప్తు చేసి ఒకరిని, పెద్దపల్లి పీఎస్‌లో ఎనిమిది మంది వ్యక్తుల నుంచి రూ.5800 జప్తు చేసి పోలీసు కేసులు పెట్టారన్నారు. కోడ్ అమలులో ఉన్నప్పుడు రూ.50వేల పైన కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఆధారాలు అడగాలని ఉన్నా, అది జిల్లాల్లో అమలు కాలేదన్నారు. రూ.10లక్షలకు పైబడి పట్టుకున్నప్పుడే మాత్రమే ఆ విషయాలు ఐటీ శాఖకు తెలియచేయాలని ఉన్నా ఇష్టం వచ్చినట్లు వ్యవహరించారన్నారు.