తెలంగాణ

మిషన్ భగీరథ, కాళేశ్వరంపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, నవంబర్ 13: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత్య ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టులపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం మానుకోవాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా వరంగల్ అర్బన్ జిల్లా గ్రామ పంచాయతీలకు బుధవారం ట్రాక్టర్ల పంపిణీ కార్యక్రమం హన్మకొండ జేఎన్‌ఎస్ గ్రౌండ్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ 30 రోజుల ప్రణాళికను మహాయజ్ఞంలా నిర్వహించి దేశంలోనే తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చారన్నారు. మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టులు కేంద్ర మంత్రులు కూడా ప్రశంసించారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క ఇలాంటి ప్రాజెక్టులపై తప్పుడు ఆరోపణలు మానుకోవాలని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మిషన్ భగీరథలో 50 వేల కోట్ల అవినీతి జరిగిందని భట్టివిక్రమార్క ఆరోపించడం అవివేకం అని అన్నారు.
అసలు మిషన్ భగీరథలో ఇప్పటి వరకు కేవలం 29 వేల కోట్లు మాత్రమే ఖర్చు పెడితే 50 వేల కోట్లు అవినీతి ఎలా జరిగిందో ఆయనే ప్రజలకు చెప్పాలన్నారు. అవగాహన లేని ఆరోపణలు చేసి నవ్వుల పాలు కావొద్దని ఆయన హితవు పలికారు.
మంచి నీటి సరఫరా కోసం గత ప్రభుత్వం కేవలం నాలుగు వేల కోట్లు ఖర్చు చేసి చేతులు దులుపుకుందన్నారు. అప్పుడు గ్రామ పంచాయతీలపై భారం పడేదని, ఇప్పుడు మంచినీళ్ల ఖర్చు పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. గ్రామ పంచాయతీలలో నిధులకు ఎలాంటి కొరత లేదని, వచ్చిన ప్రతి పైసా గ్రామాల అభివృద్ధి కోసమే సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. సర్పంచ్ పదవి ఓ వరం అని, తన తండ్రి సర్పంచ్‌గా దశాబ్దాల కాలం పనిచేశారని, అయితే ఆయన అప్పుడు చేసిన అభివృద్ధే తనను ఎమ్మెల్యే చేసిందన్నారు. ప్రతి సంవత్సరం జనవరి 26న ఐదుగురు ఉత్తమ సర్పంచ్‌లకు సన్మానం నిర్వహించాలని జిల్లా కలెక్టర్లకు మంత్రి సూచించారు. గ్రామాల్లో సర్పంచ్‌లు చెక్కులపై సంతకాలు పెట్టకుండా ఉపసర్పంచ్‌లు ఇబ్బందులకు గురిచేస్తే గ్రామ సభ తీర్మానం మేరకు ఉప సర్పంచ్‌లకు చెక్ పవర్ తొలగిస్తామని తెలిపారు. గ్రామాలు బాగు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. గ్రామాల అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా అందరూ కలసి రావాలని ఆయన కోరారు. మొదటి విడతగా 50 గ్రామ పంచాయతీల సర్పంచ్‌లకు ట్రాక్టర్లను పంపిణీ చేశారు. వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ అధ్యక్షతన వహించగా జడ్పీ చైర్మన్ సుధీర్‌కుమార్, రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాష్, ఎమ్మెల్యే ఆరూరి రమేష్, నన్నపునేని నరేందర్, వీ.సతీష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
*చిత్రం...ట్రాక్టర్ల పంపిణీ కార్యక్రమంలో ప్రసంగించి, సరదాగా ట్రాక్టర్ నడుపుతున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు