తెలంగాణ

కొత్త ప్రోటోకాల్ రూపొందించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 14: తెలంగాణ రాష్ట్రానికి కొత్త ప్రోటోకాల్‌ను తయారు చేసుకోవాల్సిన అవసరం ఉందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం అమలు చేస్తున్న ప్రోటోకాల్ చట్టం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రూపొందించిందని గుర్తు చేశారు. శాసనమండలి సభా హక్కుల కమిటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ అధ్యక్షతన గురువారం సమావేశమైంది. ఈ సమావేశానికి హాజరైన మండలి చైర్మన్ గుత్తా మాట్లాడుతూ, ప్రోటోకాల్ చట్టాన్ని నిర్దేశించిన బ్లూ బుక్‌పై అధికారులకు అవగాహన లేక శాసనమండలి సభ్యులకు తగిన గౌరవం దక్కడం లేదన్నారు. తెలంగాణ ప్రోట్‌కాల్ బుక్‌ను తయారు చేసి మండలి సభ్యులు ఎమ్మెల్సీలకు ఇచ్చే గౌరవం, బాధ్యతల గురించి రాష్ట్ర, జిల్లా అధికారులకు అవగాహన కల్పించాలని సూచించారు. శాసనమండలి చైర్మన్, వైస్ చైర్మన్, సభ్యులకుండే అధికారాలు, గౌరవ మర్యాదల గురించి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని శాసనసభ కార్యదర్శిని ఆదేశించారు. రాజ్యాంగబద్ధంగా శాసనసమండలికి విశేష అధికారాలు ఉన్నాయని వీటి గురించి ఆర్టికల్ 14లో స్పష్టంగా ఉందని గుర్తు చేశారు. అయితే చాలా మంది అధికారులకు చట్టాలపై అవగాహన లేదని చైర్మన్ గుత్తా ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల, ఉపాధ్యాయ, పట్ట్భద్రుల నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్సీలకు ప్రోటోకాల్‌ను పాటించక పోవడం వల్ల కొన్ని సందర్భాల్లో అవమానానికి గురి అవుతున్నారని చైర్మన్ అన్నారు. ఇక ముందు ఎమ్మెల్సీలకు జరిగిన అవమానాలు పునరావృతం కాకుండా జాగ్రత్త వహించాలని అధికారులకు సూచించారు. శాసనమండలి సభ్యులకు కల్పించిన ప్రోటోకాల్ నిబంధనలపై బ్లూ బుక్స్ చదివితే అధికారులకు తెలిసి ఉండేదన్నారు. అయితే చాలా మంది అధికారులకు ఈ బుక్ గురించే తెలియదని, కొందరికి తెలిసినా దానిని చదవరని అసంతృప్తి వ్యక్తం చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత ప్రోటోకాల్ నిబంధనలపై చాలా మంది అధికారులకు అవగాహన లేదని అన్నారు. హక్కుల కమిటి తీసుకునే నిర్ణయాలు తూ.చ తప్పకుండా అమలు జరపాలని అధికారులను చైర్మన్ గుత్తా ఆదేశించారు. మండలి చైర్మన్, వైస్ చైర్మన్‌తో పాటు సభ్యులకు కూడా ఇక ముందు ఎక్కడా అవమానం జరగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని గుత్తా హెచ్చరించారు. సభా హక్కుల కమిటీ సభ్యులతో పాటు శాసనసభ కార్యదర్శి వేదాంతం నరసింహాచార్యులు పాల్గొన్నారు.
*చిత్రం... శాసనమండలిలో గురువారం జరిగిన సభా హక్కుల కమిటీ సమావేశంలో కమిటీ చైర్మన్ నేతి విద్యాసాగర్‌కు పుష్పగుచ్ఛాన్ని అందజేస్తున్న మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి