తెలంగాణ

నిధుల కోసం ప్రణాళిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ప్రతిష్టాకరమైన కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఏఐబీపీ పథకం నుంచి నిధులు మంజూరయ్యేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేయనుంది. సత్వరమే ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి స్కీం కింద కేంద్రం ప్రతి ఏటా రాష్ట్ర ప్రభుత్వాలకు నిధులు మంజూరు చేస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 15 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలన్న సంకల్పంతో ఈ ప్రాజెక్టు పనులను వేగవంతం చేసిన విషయం విదితమే. కేంద్ర జల సంఘానికి ఈ మేరకు ఇప్పటికే ప్రాథమిక నివేదికను సాగునీటి పారుదల శాఖ పంపింది. కేంద్రం నుంచి క్లియరెన్సు వచ్చిన వెంటనే నిధుల సేకరణపై ప్రభుత్వం తుది నిర్ణయం
తీసుకోనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం నిమిత్తం ఈ ఏడాది ఏప్రిల్ వరకు రూ.47వేల కోట్లను ఖర్చుపెట్టింది. మొత్తం ప్రాజెక్టు వ్యయంలో ఇంతవరకు 59 శాతాన్ని ప్రభుత్వం ఖర్చుపెట్టింది. ఈ ప్రాజెక్టు 2022-23 నాటికి పూర్తి చేయాలన్న సంకల్పంతో కేసీఆర్ ఉన్నారు. వచ్చే నాలుగేళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రూ.32,381 కోట్లను ఖర్చుపెట్టాల్సి ఉంది. నిధుల కోసం ఏఐబీపీ స్కీం మీద ఆధారపడడం మంచిదని సాగునీటి శాఖాధికారులు రాష్ట్రప్రభుత్వానికి తెలిపారు. 2015-16 సంవత్సరంలో ఈ ప్రాజెక్టును రూ. 80,190 కోట్లతో నిర్మించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించిన విషయం విదితమే. రాష్ట్రంలో 11 ప్రాజెక్టులకు ఏఐబీపీ కింద నిధులు అందుతున్నాయి. నాలుగు మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు, ఏడు మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు రూ.4156.19 కోట్లను కేంద్రం విడుదల చేసింది. ఈ ప్రాజెక్టులకు ఆమోదించిన సమయంలో 2005-06లో ఈ ప్రాజెక్టుల నిర్మాణం వ్యయం రూ.11,485 కోట్లవుతుందని అధికారులు అంచనా వేశారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుల వ్యయం సవరించిన అంచనాల ప్రకారం రూ. 21,683 కోట్లకు పెరిగింది. ఈ ప్రాజెక్టుల నిర్మాణం కోసం ఇంతవరకు రూ.18,214 కోట్లను ఖర్చుపెట్టారు. ఇందులో మూడు ప్రాజెక్టుల నిర్మాణం ఇటీవలనే పూర్తయింది. ఈ 11 ప్రాజెక్టుల ద్వారా 63వేల హెక్టార్ల మేర భూములకు సాగునీటిని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.