తెలంగాణ

రక్తమోడుతున్న రోడ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో 2018లో 22వేల రోడ్డు ప్రమాద సంఘటనల్లో 6,603 మంది మృతి చెందినట్లు కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వశాఖ విడుదల చేసిన గణాంక వివరాల్లో పేర్కొంది. సగటున రోజుకు 18 మంది రోడ్డు ప్రమాదాల్లో వ్యక్తులు మృత్యువాత పడుతున్నారు. ఈ ప్రమాదాల్లో 22,613 మంది గాయపడ్డారు. దేశంలో వరుస సంఖ్యలో చూస్తే రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిదివ స్థానంలో తెలంగాణ నిలిచింది. ప్రతి వంద ప్రమాదాల్లో 29.7 శాతం మంది మృతి చెందుతున్నారు. 2017తో పోలిస్తే 2018లో రోడ్డు ప్రమాద ఘటనల సంఖ్య తగ్గింది. 2017లో 22,484 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. కాని మృత్యువాత పడే వారి సంఖ్య పెరిగింది. 2017లో 6596 మంది మరణించారు. మృతుల సంఖ్య 0.1 శాతం పెరిగింది. గాయపడే వారి సంఖ్య తగ్గింది. 2017లో 23,990 మంది గాయపడ్డారు. జాతీయ రహదారులపైన 2064 మంది రోడ్డు ప్రమలాదాల్లో మరణించారు. 2017లో ఇదే ఘటనల్లో 1954 మంది దుర్మరణం పాలయ్యారు. రాష్ట్ర రహదారులపై జరిగిన రోడ్డు ప్రమాదాలను విశే్లషిస్తే 2017లో 1357 మంది మరణిస్తే 2018లో 1165 మంది మృతి చెందారు. 2018లో ఎదురెదురు వాహనాలు ఢీ కొన్న సంఘటనల్లో 3,475 మంది
మరణించారు. మొత్తం 22,230 ఘటనల్లో 4,9423 ఘటనలు ఎదురెదురు వాహనాలు ఢీ కొనగా జరిగాయి. కాగా 5927 ఘటనల్లో వెనక నుంచి వాహనాలు ఢీ కొంటే ప్రమాదాలు జరిగాయి. హిట్ అండ్ రన్ కేసులు 690, రోడ్డుపక్కకు వాహనాలు వేగంగా దూసుకెళ్లిన కేసుల్లో 1,093 మంది మరణించారు.