తెలంగాణ

ఫిర్యాదుకు ధైర్యంగా ముందుకు రండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 23: తమకు జరుగుతున్న అన్యాయాలపై మహిళలు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని రాష్ట్ర పోలీసు మహిళల భద్రత విభాగం ఇన్‌స్పెక్టర్ జనరల్ స్వాతి లక్రా అన్నారు. మహిళల భద్రత, సైబర్ నేరాలపై పూర్తి స్థాయి అవగాహన కలిగించేందుకు ఉచిత ఈ లెర్నింగ్ కోర్సులు రాష్ట్ర పోలీసు విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం బంజారాహిల్స్‌లోని సుల్తాన్ ఉల్ ఉలుమ్ కళాశాలలో అవగాహన సెషన్ నిర్వహించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సదస్సులో ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళల భద్రత కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. మహిళలకు జరుగుతున్న అన్యాయాలు, సైబర్ నేరాగాళ్ల బారిన పడకుండా తీసుకోవాల్సిన చర్యల గురించి ఆమె వివరించారు.
ప్రధానంగా కళాశాలల్లో చదువుకుంటున్న విద్యార్థినులు తమకు జరిగిన అన్యాయాలు, వేధింపులకు సంబంధించి వెంటనే కాలేజీ యాజమాన్యం లేదా పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. తెలంగాణ పోలీసులు తీసుకుంటున్న వివిధ చర్యల వల్ల మహిళలపై వేధింపులు తగ్గాయని, మహిళల పూర్తి రక్షణ కోసం ప్రభుత్వం షీ టీమ్స్‌ను ఏర్పాటు చేసిందన్నారు. మహిళలు ఏమైనా సమస్యలు, వేధింపులకు గురైన పక్షంలో స్థానిక పోలీస్టేషన్‌లలో లేదా షీ టీమ్స్, లేదా భరోసా కేంద్రాలను సంప్రదించాలని, తద్వారా వారికి తగిన న్యాయం జరుగుతుందని స్వాతి లక్రా తెలిపారు.
ఈ కార్యక్రమంలో సుల్తాన్ ఉల్ ఉలుమ్ ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యదర్శి జాఫర్ జావేద్, సభ్యుడు అమేర్ జావేద్, ప్రిన్సిపాల్ షాబాజ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.
*చిత్రాలు.. ..మహిళల భద్రత కోసం అవగాహన కల్పించేందుకు ప్రారంభించిన ఈ లెర్నింగ్ కోర్సు
అవగాహన సదస్సులో మాట్లాడుతున్న మహిళల భద్రత విభాగం ఐజీ స్వాతి లక్రా