తెలంగాణ

అత్యున్నత ప్రమాణాలతో జాతీయ పోలీస్ వర్సిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 24: దేశంలో ప్రపంచ స్థాయి అత్యున్నత ప్రమాణాలతో కూడిన జాతీయ పోలీసు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జీ కిషన్ రెడ్డి చెప్పారు. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నామన్నారు. అయితే, ఈ యూనివర్శిటీని ఎక్కడ ఏర్పాటు చేయనుందనే విషయమై కేంద్రం ప్రకటించలేదు. కేంద్ర ప్రభుత్వం జాతీయ పోలీసు విశ్వవిద్యాలయం ఏర్పాటుపై ఒక చట్టాన్ని తీసుకురానుంది. ఈ యూనివర్శిటీలో పోలీసు సైన్స్, సైబర్ ఫోరెన్సిక్స్, రిస్క్ మేనేజిమెంట్, క్రిమినాలజీ కోర్సులను ప్రవేశపెట్టనున్నారు. పోలీసింగ్, లా ఎన్‌ఫోర్స్‌మెంట్, ఆంతరంగిక భద్రత, పబ్లిక్ సేఫ్టీ అంశాలపై ఈ విశ్వవిద్యాలయంలో పరిశోధనలు జరుగుతాయి. పోలీసు వ్యవస్థ ఆధునీకరణకు ఇప్పటికే కేంద్రం ఇతోధికంగా నిధులు ఇస్తోంది. పోలీసు సంస్కరణలను కూడా వేగవంతం చేసేందుకు ఈ వర్శిటీ ఉపయోగపడుతుంది. పోలీసులకు సమాచార టెక్నాలజీ, ఆధునిక అంశాలపై శిక్షణ ఇచ్చే ఉద్దేశ్యంతో ఈ వర్శిటీని ఏర్పాటు చేయనున్నారు.
*చిత్రం... కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి