తెలంగాణ

నేడు అటవీ హరిత హారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 17: హరిత హారంలో భాగంగా సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా అటవీ ప్రాంతాల్లో కోటి మొక్కలు నాటుతారు. ఇందుకోసం అటవీ శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. జిల్లాల వారిగా అటవీ ప్రాంతాల్లో, రిజర్వ్ ఫారెస్ట్‌లో మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ ప్రణాళిక అమలు కోసం అటవీ శాఖ మంత్రి జోగు రామన్న అన్ని జిల్లాల్లో ఇప్పటికే పర్యటించారు. ఈ కార్యక్రమాన్ని ఖమ్మం జిల్లాలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి మంత్రి రామన్న ప్రారంభిస్తారు. హరిత హారంలో మొక్కలు నాటడంలో ఆదిలాబాద్ ముందు వరుసలో ఉంది. అటవీ ప్రాంతాల్లో మొక్కలు నాటడంలోనూ మొదటి స్థానంలో నిలిచే విధంగా మోక్కలు నాటాలని నిర్ణయించారు. ఆదిలాబాద్‌లో 24లక్షలు, ఖమ్మం 12.50లక్షలు, వరంగల్ 12 లక్షలు, నిజామాబాద్‌లో 11లక్షలు, కరీంనగర్‌లో 11లక్షలు, మహబూబ్‌నగర్‌లో 5.9లక్షలు, రంగారెడ్డిలో 5.6లక్షల మొత్తం ఒక కోటి మొక్కలు అటవీ ప్రాంతాల్లో, రిజర్వ్ ఫారెస్ట్‌లో నాటుతారు.