తెలంగాణ

వేర్పాటువాదులను అరెస్టు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జులై 17: సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్న కాశ్మీర్ వేర్పాటు వాదులను అరెస్టు చేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఎబివిపి) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి ఎల్. అయ్యప్ప రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జమ్మూ-కాశ్మీర్‌ను వేరు చేయాలని మారణహోమం సృష్టిస్తున్న హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వని ఎన్‌కౌంటర్‌ను నిరసిస్తూ 16వ తేదీ సాయంత్రం 6 గంటల సమయంలో జమ్మూ-కాశ్మీర్‌కు చెందిన కొందరు వేర్పాటు విద్యార్థులు దేశానికి వ్యతిరేకంగా, ఉగ్రవాదులకు అనుకూలంగా కార్యక్రమం నిర్వహించారని ఆయన ఆదివారం ఒక ప్రకటనలో ఆరోపించారు. దీనిని నిరసిస్తూ ఎబివిపి విద్యార్థులు రాత్రి 11 గంటలకు ‘్భరత్ మాతాకీ జై’ అంటూ నినాదాలు చేస్తూ బయలుదేరినట్లు చెప్పారు. అదే సమయంలో ఎన్‌ఆర్‌ఎస్ హాస్టల్ నుంచి అనిగ్జిర్ హాస్టల్‌కు వచ్చే క్రమంలో వేర్పాటు వాద శక్తులు, ఎబివిపి విద్యార్థులపై దాడి చేయడం జరిగిందని, ఈ దాడిలో పరిశోధన విద్యార్థి కైలాసం గూడూరికి తీవ్ర గాయలయ్యాయని, దీంతో హెచ్‌సియు ఆసుపత్రికి తరలించడం జరిగిందని ఆయన వివరించారు. అక్కడి వైద్యులు పరీక్షించి మదీనాగుడాలోని ప్రణయ్ ఆసుపత్రికి వెళ్లాల్సిందిగా సూచించారని ఆయన తెలిపారు. అక్కడికి గాయపడిన విద్యార్థిని తీసుకెళ్ళగా, డాక్టర్లు పరిశీలించి హైటెక్ సిటీలోని కేర్ ఆసుపత్రికి తీసుకెళ్ళాల్సిందిగా చెప్పడంతో అక్కడికి తీసుకెళ్ళి అడ్మిట్ చేయించినట్లు అయ్యప్ప పేర్కొన్నారు. గాయపడిన విద్యార్థిని చూసేందుకు తెల్లవారుజామున వచ్చిన సుశీల్‌పై, ఆయన మిత్రులపై ఆసుపత్రి ప్రాంగణంలో దాడి జరిగిందని ఆయన తెలిపారు. దీంతో వారు మియాపూర్ పోలీసు స్టేషన్‌కు వెళ్ళి ఫిర్యాదు చేశారని ఆయన వివరించారు. కాబట్టి హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో ఉగ్రవాద మద్దతు కార్యక్రమాలను నిర్వహిస్తున్న వారిని అరెస్టు చేయాలని అయ్యప్ప డిమాండ్ చేశారు.