తెలంగాణ

నాలుగేళ్లలో 3 లక్షల ఉద్యోగాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 2: వచ్చే నాలుగేళ్లలో ఎలక్ట్రానిక్స్ అండ్ మానుఫాక్చరింగ్ రంగాల్లో 3 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయని పరిశ్రమలు, ఐటీశాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. ఐటీ రంగంలో ఒకనాడు బెంగళూరు ముందంజలో ఉంటే ప్రస్తుతం ఈ స్థానాన్ని హైదరాబాద్ అక్రమించిందని అన్నారు. సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్, ఎలక్ట్రానిక్స్, యానిమేషన్, గేమింగ్, ఆఫీస్ స్పేస్ రంగాల్లో హైదరాబాద్, బెంగళూరుకు దీటుగా దూసుకుపోతోందని మంత్రి
అన్నారు. హైదరాబాద్ రాయదుర్గంలో ఇంటెల్ ఇండియా డిజైన్ అండ్ ఇంజనీరింగ్ సెంటర్‌ను సోమవారం మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, బెంగళూరు తర్వాత తన నూతన ఆర్ అండ్ డిజైన్ సెంటర్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించడం శుభపరిణామం అన్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన ఇంటెల్ కేంద్రంలో సుమారు 1500 మంది ఉద్యోగులు పనిచేసే సామర్ధ్యం కలిగి ఉందన్నారు. ఇండియా నుంచి తన ఎక్సెస్ స్కేల్ కంప్యూటర్ అభివృద్ధికి ఇంటెల్ సంస్థ హైదారాబాద్‌ను ఎంపిక చేసుకోవడం తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణమని అన్నారు. హార్డ్‌వేర్ రంగంలో నూతన ఆవిష్కరణ కర్తల కోసం ఉద్దేశించిన టీ-వర్క్స్‌ను వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ప్రారంభించనున్నట్టు కేటీఆర్ ప్రకటించారు. తెలంగాణలో ఐటీ రంగం అభివృద్థి కోసం ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ ఎంతో కృషి చేస్తున్నారని మంత్రి కొనియాడారు. హైదరాబాద్‌లో ఐటీ రంగం అభివృద్ధిలో జయేశ్ రంజన్ భాగస్వామ్యం ఉందన్నారు.
*చిత్రం...రాయదుర్గంలో ఇంటెల్ ఇండియా డిజైన్ అండ్ ఇంజనీరింగ్ సెంటర్‌ ప్రారంభ కార్యక్రమంలో మాట్లాడుతున్న పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్