తెలంగాణ

ఊపందుకున్న టి ఆర్టీసి ఎన్నికల ప్రచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 17: ఈనెల 19న జరుగనున్న టిఆర్టీసి గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచారం సాధారణ ఎన్నికలను తలపిస్తోంది. ఆర్టీసి తెలంగాణ వ్యాప్తంగా 57 బస్సు డిపోల్లో 10 వేల బస్సులను నడిపిస్తుంది. 22వేల మంది కార్మికులు ఉన్న సంస్థలో అధికార కార్మిక సంఘం గుర్తింపునకు జరుగుతున్న ఎన్నికల్లో ప్రధాన పోటీ టిఎంయూ, ఎంప్లారుూస్ యూనియన్ మధ్యే జరుగుతోంది. మంగళవారం జరుగనున్న ఎన్నికల నేపథ్యంలో సికిందరాబాద్ జూబ్లీ బస్‌స్టేషన్లో ఆదివారం తెలంగాణ మజ్దూర్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనియన్ కార్మికుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇరువర్గాలు ఏకకాలంలో ప్రచారం చేపట్టడంతో కార్మికులు పరస్పర దాడులకు పూనుకున్నారు. ఈ ఘర్షణలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఎన్నికల్లో టిఎంయూ ఒంటరిగా పోటీ చేస్తుండగా ఎంప్లారుూస్ యూనియన్, స్ట్ఫా వర్కర్స్ ఫెడరేషన్‌ను కలుపుకొని పోటీ చేస్తుంది. ఇదిలావుండగా ఇటీవల కాలంలో వేతన సవరణ కోసం ఆర్టీసి జెఎసి ఆధ్వర్యంలో సమ్మె నిర్వహించారు. కార్మికులు ఊహించిన దానికంటే 42 శాతం ఫిట్‌మెంట్ ప్రకటన వెలువడడంతో ఎన్నికల్లో టిఎంయూకు గెలిచే అవకాశం కలిసొచ్చింది. కాగా టిఎంయూ అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు ఈ ఎన్నికల్లో ఎస్‌డబ్ల్యుఎఫ్‌తో కలసి పోటీ చేస్తున్న ఎంప్లారుూస్ యూనియన్ అత్యధిక మెజార్టీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తోంది.
బకాయిల చెల్లింపులో భిన్నాభిప్రాయాలు..
ఆర్టీసి కార్మికులకు 2013 నుంచి రావలసిన బకాయిల చెల్లింపులో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టిఎం యూ గెలుపుకోసం ఆధికార పార్టీ టిఆర్‌ఎస్ యత్నిస్తుండగా, ఎంప్లారుూస్ యూనియన్ మాత్రం గెలుపు తమదేనని ధీమాతో ఉంది. ప్రభుత్వం కార్మికుల ఎరియర్స్ వెంటనే చెల్లించాలని ఎంప్లారుూస్ యూనియన్ కోరగా ఎన్నికల కోడ్ ఉందంటూ రెండ్రోజుల క్రితం చెల్లింపులను నిలిపివేసిన విషయం విదితమే. కాగా శనివారం రాత్రి కార్మిక శాఖ అధికారులతో జరిగిన చర్చలు సఫలం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసి కార్మికులకు చెల్లించాల్సిన బకాయిల్లో రూ. 150 కోట్లు విడుదల చేసింది. అయితే బకాయిల చెల్లింపులు ఎన్నికల లోపు జరుగుతాయా..లేదా ఎన్నికల తరువాత చెల్లింపులా..అన్న మీమాంస కార్మికులను వెంటాడుతోంది.