తెలంగాణ

ఆ రెండు ఎమ్మెల్సీ పదవులు తెరాస ఖాతాలోకేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, నవంబర్ 29: ప్రాదేశిక, పురపాలిక (ప్రజాప్రతినిధులు)ల సంఖ్యా పరంగా చూస్తే దాదాపుగా టిఆర్‌ఎస్ ఖాతాలోకే రెండు ఎమ్మెల్సీ పదవులు వెళ్లే అవకాశాలున్నట్లు రాజకీయ పరిశీలకుల అంచనా. ఇప్పటికే జిల్లాలో ఎదురులేని శక్తిగా అవతరించిన తెరాసకు మరో రెండు ఎమ్మెల్సీ స్థానాలు దక్కే అవకాశాలు కన్పిస్తున్నాయి. జిల్లాలోని 13 మంది ఎమ్మెల్యేలకుగాను 12మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపిలు టిఆర్‌ఎస్ నుంచి చట్టసభల్లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. రెండింటికి రెండు ఎమ్మెల్సీ స్థానాలు దక్కే అవకాశాలు ఉన్న దరిమిలా ఎమ్మెల్సీ టికెట్ ఆశిస్తున్న ఆశావహుల సంఖ్య ఐదారుగురికి పెరిగిపోయింది. వీరంతా హైదరాబాద్‌లోనే మకాం వేసి, సిఎం కెసిఆర్ ప్రసన్నం కోసం ఎవరికి వారే తీవ్ర ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. మాజీ ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణ్‌రావు, భానుప్రసాదరావు, చెన్నాడి సుధాకర్‌రావు, టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డితోపాటు నాయకులు వెలిచాల రాజేందర్‌రావు, వీర్ల వెంకటేశ్వర్‌రావు, కట్ల సతీష్ తదితరులు టికెట్‌ను ఆశిస్తున్న వారిలో ఉన్నారు. అయితే, ప్రధానంగా మాజీ ఎమ్మెల్సీలైన లక్ష్మణ్‌రావు, భానుప్రసాదరావు, సుధాకర్‌రావుల మధ్యే తీవ్ర పోటీ ఉండగా, సిఎం కెసిఆర్ మాత్రం లక్ష్మణ్‌రావు, భానుప్రసాదరావుల వైపే మొగ్గు చూపుతున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీగా గెలుపొందిన భానుప్రసాద్‌రావు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చే ఒప్పందంపైనే టిఆర్‌ఎస్‌లో చేరినట్లు అప్పట్లో ప్రచారం జరగగా, టిడిపి నుంచి ఎమ్మెల్సీగా గెలుపొందిన చెన్నాడి సుధాకర్‌రావు కూడా అదే అగ్రిమెంట్‌తో గులాబీ గూటికి చేరినట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ టికెట్ కేటాయింపు ఆంశం తెరాసలో ఉత్కంఠ, ఆసక్తి రేపుతోంది. కాగా, జిల్లాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు డిసెంబర్ 2న నోటిఫికేషన్ జారీకానుండగా, 1205 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో డివిజన్‌ల వారీగా కరీంనగర్‌లో 414, సిరిసిల్లలో 190, మంథనిలో 90, జగిత్యాలలో 311, పెద్దపల్లిలో 200మంది చొప్పున ఓటర్లు ఉన్నారు. వీరిలో 817 ఎంపిటిసిలు, 100మంది కార్పోరేటర్లు, 220 మంది కౌన్సిలర్లు, నగర పంచాయితీ వార్డు సభ్యులు, 57మంది జడ్పీటిసి సభ్యులు ఉన్నారు. ఇందులో అప్పటి ఫలితాల ప్రకారం 520 టిఆర్‌ఎస్, 406 కాంగ్రెస్, 78 బిజెపి, 48టిడిపి, 8ఎంఐఎం, 5సిపిఐ, 140 ఇతరులు ఉన్నారు. అయితే, పలు పార్టీల్లో నుంచి కొంతమంది ప్రజాప్రతినిధులు టిఆర్‌ఎస్ కండువా కప్పుకున్నారు. కార్పోరేషన్, మున్సిపల్, నగర పంచాయితీల్లో ఎక్స్‌అఫిషియో సభ్యులుగా ఉన్న 9మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపిలు ఓటర్లుగా ఉండగా, వీరు కూడా టిఆర్‌ఎస్ పార్టీకి చెందిన వారే. ఈ లెక్కల ప్రకారం ఎమ్మెల్సీ స్థానాలు అవలీలగా గెలుచుకునే అవకాశాలు ఉండటం, అందులో టిఆర్‌ఎస్ అధికారంలో ఉండటం ఆ పార్టీకి కలిసొచ్చే అదృష్టం. ఈ క్రమంలో టిఆర్‌ఎస్ నుంచి టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్య పెరగగా, సిఎం కెసిఆర్ ఎవరిని దీవిస్తారోననే చర్చ మాత్రం ఆ పార్టీలో ఆసక్తి రేపుతోంది. ఇదిలా ఉండగా, వరంగల్ ఉప ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన కాంగ్రెస్, టిడిపి, బిజెపిలు ఇంకా తేల్చుకోలేక మల్లగుల్లాలు పడుతున్నాయి. నోటిఫికేషన్ జారయ్యే నాటికి ఈ పార్టీల్లో ఒక స్పష్టత వచ్చే అవకాశాలుండగా, ఎంపిటిసి ఫోరం నుంచి పోటీ చేయనున్నట్లు ఆ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కరుణాకర్ వెల్లడించిన సంగతి తెలిసిందే. మొత్తం మీద జిల్లాలో రెండు ఎమ్మెల్సీ పదవులు తెరాసకే దక్కే చాన్స్ ఉండటంతో ప్రతిపక్ష పార్టీలు ఆందోళన చెందుతున్నాయ.