తెలంగాణ

నరుూం ముఠా సభ్యుల రిమాండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చౌటుప్పల్, జూలై 18: నల్లగొండ జిల్లా చౌటుప్పల్ పట్టణానికి చెందిన భాస్కర్ సినిమా టాకీస్ యజమాని మంచికంటి భాస్కర్ కిడ్నాప్‌నకు యత్నించిన నరుూం ముఠాకు చెందిన నలుగురు సభ్యులతో పాటు, మరో ఇద్దరు వ్యాపారులను సోమవారం అరెస్టు చేసి రామన్నపేట కోర్టులో హాజరుపర్చగా నల్లగొండ జైలుకు రిమాండ్ చేసినట్లు చౌటుప్పల్ సిఐ నవీన్‌కుమార్ తెలిపారు. సంస్థాన్‌నారాయణఫురం మండలం సర్వేల్‌కు చెందిన చిలుక సురేశ్ (46), హైదరాబాద్ జియాగూడెం చెందిన చౌకటోలి అమర్ (35), కర్మన్‌ఘాట్‌కు చెందిన ఆవుల వెంకటేశ్ (26), ఆల్వాల్‌కు చెందిన గంధం గోవర్థన్ (26), వీరితో పాటు మంచికంటి మధుసూదన్ (58), మంచికంటి శ్రీశైలం (53)లను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు.