తెలంగాణ

23న కాంగ్రెస్ పార్టీ పవర్ పాయింట్ ప్రజంటేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 18: నీటి పారుదల ప్రాజెక్టులపై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే తేదీని ఎట్టకేలకు ఖరారు చేసింది. మార్చిలో జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు ఆ ప్రజెంటేషన్‌ను టి.కాంగ్రెస్ బహిష్కరించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ప్రభుత్వం అన్నీ తప్పుడు లెక్కలు చెప్పినందున, వాస్తవాలు ఏమిటో తాము చెబుతామంటూ ఇంత కాలం నేతలూ చెబుతూ వచ్చారు. పైగా పవర్ పాయింట్ ఇచ్చే తేదీని ప్రకటించకపోవడంతో, చివరకు ఒక దశలో ముఖ్యమంత్రి కెసిఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తనకూ చూడాలని ఉందని వ్యాఖ్యానించారు. దీనిపై చాలా కాలంగా తర్జన-్భర్జన పడుతూ వచ్చారు. తాజాగా స్పీకర్ మధుసూదనా చారిని టి.కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ కలిసి తమ పార్టీకీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు అవకాశం కల్పించాలని కోరడం జరిగింది. అయితే స్పీకర్ ఆ వినతిపై తన నిర్ణయం వెల్లడించలేదు. కాగా ఈ నెల 23న పార్టీ కార్యాలయమైన గాంధీ భవన్‌లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి మీడియాకు చెప్పారు. నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణంలో భారీగా అంచనాలు పెంచి ప్రజాధనాన్ని దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రభుత్వం లెక్కకు మించి ఆయకట్లను చూపిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నదని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ అసెంబ్లీలో చూపించిన తప్పుడు లెక్కలకు తాము కౌంటర్ ఇవ్వబోతున్నట్లు ఉత్తమ్‌కుమార్ రెడ్డి చెప్పారు.