తెలంగాణ

రియాక్టర్ గ్యాస్ లీకయ ఇద్దరికి అస్వస్థత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిట్యాల, జూలై 18: రసాయన పరిశ్రమలో రియాక్టర్ గ్యాస్ లీక్ కావడంతో ఇద్దరు ఉద్యోగులు అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా చిట్యిల మండలంలోని పిట్టంపల్లి గ్రామ శివారులోని నోస్ పరిశ్రమలో సోమవారం రాత్రి జరిగింది. పిట్టంపల్లి గ్రామ శివారులో గల నోస్ రసాయన పరిశ్రమలో రోజువారిగా పనులు జరుగుతుండగా ప్రమాదవశాత్తు రియాక్టర్ వాల్వ్ వదులు కావడంతో రియాక్టర్‌లోని గ్యాస్ ఒక్కసారిగా వేగంగా బయటకు వచ్చింది. గ్యాస్ బయటకు వచ్చి రసాయన పౌడర్‌తో పాటు మంటలు వ్యాపించాయి. ఆ సమయంలో సదరు బ్లాక్‌లో విధుల్లో ఉన్న ఇన్‌చార్జి ప్రభాకర్‌రెడ్డి, కెమిస్ట్ సురేష్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిని చికిత్స నిమిత్తం చౌటుప్పల్‌లోని ఆసుపత్రికి తరలించారు.
సమాచారం అందుకున్న పరిశ్రమలోని ఉద్యోగులు, కార్మికులు ఘటన ప్రాంతానికి చేరుకుని ప్రమాదంలో చిక్కుకున్న ఉద్యోగులను కాపాడి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గ్యాస్ లీక్‌ను నివారించే చర్యలు చేపట్టారు. మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఘటనలో భారీ ప్రమాదం తప్పడంతో ఉద్యోగులు, కార్మికులు, గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు.