తెలంగాణ

మున్సి‘పోల్’లో ముఖాముఖి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 14: రాష్ట్రంలో 120 మున్సిపాలిటీలు, తొమ్మిది మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి ఎన్నికల ‘బరి’ లో మిగిలింది దాదాపు 18 వేల మందిగా తేలింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారికంగా మంగళవారం రాత్రి వరకు పూర్తి వివరాలను విడుదల చేయలేదు. రాజకీయ పరంగా మినహా అధికారికంగా ఎన్నికల కార్యక్రమం సజావుగా సాగుతోంది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి. నాగిరెడ్డి ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్లతో సంప్రదిస్తూనే ఉన్నారు. మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు నామినేషన్ల ఉపసంహరణ గడువుగా ఉండేది. ఈ సమయానికి దాదాపు ఏడు వేల మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారని సమాచారం అందింది. రాష్ట్ర వ్యాప్తంగా 60 మంది వరకు వార్డు కౌన్సిలర్లుగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు సమాచారం. ఎకగ్రీవంగా ఎన్నికైన వారిలో టీఆర్‌ఎస్ సభ్యులే అధికంగా ఉన్నారని తెలిసింది. ఈనెల 22 న పోలింగ్ జరిగే తొమ్మిది మున్సిపల్ కార్పొరేషన్లు, 120 మున్సిపాలిటీల్లో ఏకగ్రీవం పోను మరో 2992 వార్డుల్లో అన్ని స్థానాలకు టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ పోటీలో ఉన్నాయి. పూర్తి వివరాలు అందితే ఈ లెక్కల్లో కొద్దిగా తేడా వచ్చే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో టీఆర్‌ఎస్-కాంగ్రెస్ మధ్య, మరికొన్ని చోట్ల టీఆర్‌ఎస్-బీజేపీ మధ్య ప్రధాన పోటీ జరుగుతోంది. పోటీలో నిలిచిన అభ్యర్థులకు మంగళవారం ఎన్నికల గుర్తులు కేటాయించారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ, బీఎస్‌పీ, టీడీపీ తదితర రాజకీయ పార్టీల అభ్యర్థులకు వారి వారి పార్టీల గుర్తులే లభించాయి. ఎన్నికల కమిషన్ వద్ద నమోదు చేసుకున్న రాష్టస్థ్రాయి పార్టీలకు వారు కోరిన గుర్తులే లభించాయి. స్వతంత్ర అభ్యర్థులకు కమిషన్ జారీ చేసిన గుర్తుల్లో ఏదో ఒకదాన్ని కేటాయించారు.
ఇలా ఉండగా పోలింగ్ కేంద్రాలను నిర్ధారిస్తూ జిల్లా కలెక్టర్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు సమాచారం అందించారు. తాజా సమాచారం ప్రకారం 10 మున్సిపల్ కార్పొరేషన్లలోని 385 వార్డులకు 1,786 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో అత్యధికంగా అంటే 411 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. తక్కువగా బండ్లగూడెం జాగీర్ కార్పొరేషన్‌లో 85 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే, 120 మున్సిపాలిటీల్లోని 2,727 వార్డుల్లో 6,325 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో మహబూబ్‌నగర్‌లో
అత్యధికంగా అంటే 240 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటవుతున్నాయి. తర్వాత ఆదిలాబాద్‌లో 183, నల్లగొండలో 180 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటవుతున్నాయి. అతితక్కువ పోలింగ్ కేంద్రాలు 15 చొప్పున డోర్నకల్, ధర్మపురి, వర్దన్నపేటలలో ఏర్పాటు చేస్తున్నారు.
22న పోలింగ్
తొమ్మిది కార్పొరేషన్లు, 120 మున్సిపాలిటీల్లో ఈనెల 22న పోలింగ్ జరుగుతుంది. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో మాత్రం ఈ నెల 24న పోలింగ్ నిర్వహిస్తున్నారు. కౌంటింగ్ ఈనెల 25న జరుగుతుంది. కౌంటింగ్ పూర్తయిన వెంటనే ఫలితాలు వెల్లడవుతాయి. వార్డు కౌన్సిలర్ల ఎన్నికల ఫలితాలు వెలువడ్డ తర్వాత మున్సిపల్ కార్పొరేష్లకు మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మున్సిపాలిటీలకు చైర్‌పర్సన్లు, వైస్-చైర్‌పర్సన్ల ఎన్నికలు జరుగుతాయి. వీటి కోసం ఎన్నికల కమిషన్ పత్యేకంగా నోటిఫికేషన్లు జారీ చేస్తుంది. మేయర్లు, చైర్‌పర్సన్ల స్థానాలపై కనే్నసిన అభ్యర్థులు, పార్టీ పరంగా అనధికారికంగా గుర్తింపు పొందిన అభ్యర్థులు తమ విజయంతో పాటు ఇతర వార్డు కౌన్సిలర్ల గెలుపుకోసం ఆర్థికంగా, ఇతరత్రా సాయం చేస్తున్నారని తెలిసింది.

'చిత్రం... నిర్మల్‌లో మంగళవారం నామినషన్ల ఘట్టం ఉపసంహరణ ప్రక్రియను పరిశీలిస్తున్న కలెక్టర్ ప్రశాంతి