తెలంగాణ

పండుగపూట.. ప్రచార హేల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 14: మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు, పార్టీల తరఫున ప్రచారం చేస్తున్న కార్యకర్తలకు సంక్రాంతి పండుగ కరువైంది. నామినేషన్ల ఉపసంహరణ పర్వం మంగళవారం ముగియడంతో ఎన్నికల రంగంలో మిగిలిన అభ్యర్థులెవరో నిఖార్సుగా తేలిపోయింది. దాంతో గత మూడు నాలుగు రోజుల నుండి నెమ్మదిగా సాగుతున్న ప్రచారం మంగళవారం నుండి ఒక్క ఊపు అందుకుంది. ఈ నెల 20 వ తేదీ సాయంత్రం వరకే ప్రచారానికి అవకాశం ఉండటంతో కేవలం ఆరు రోజులే ప్రచార హోరు జోరున సాగాల్సి ఉంది. అందువల్ల ఈ ఆరురోజుల్లో వస్తున్న పండుగలు, వ్యక్తిగతంగా వచ్చే ఇతర ముఖ్యమైన అంశాలను పోటీలో ఉండే అభ్యర్థులు, ప్రచారంలో పాల్గొనే కార్యకర్తలు మరచిపోవాల్సి వస్తోంది. రాజకీయ పార్టీల ప్రధాన నేతలు కూడా నగరాలు, పట్టణాల్లో వీధి వీధి, వాడ వాడలా తిరగాల్సి వస్తోంది. రాజకీయ పార్టీల తరఫున ప్రచారం చేసే ‘స్టార్ క్యాంపెయినర్లు’ కూడా బుధవారం నుండి రంగంలోకి దిగుతున్నారు. అభ్యర్థుల పేర్లు మంగళవారమే అధికారికంగా ఖరారు కావడంతో పాటు వారికి లభించిన గుర్తులు కూడా కేటాయించడంతో ప్రచార హోరు ఉవ్వెత్తున ప్రారంభమైంది. సాధారణంగా సంక్రాంతి పండుగ పల్లెలు, గ్రామాలకే ఎక్కువగా పరిమితం అయినప్పటికీ, పట్టణాలు, నగరాల్లో కూడా ఇప్పుడు సందడి నెలకొంది. గ్రామాల నుండి లక్షలాది కుటుంబాలు పట్టణాలు, నగరాలకు ఉపాధి, ఉద్యోగం కోసం తరలిరావడంతో ఉన్నచోటనే పండుగు చేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు సంక్రాంతికి వారి వారి సొంత గ్రామాలు, పట్టణాలకు వెళుతున్నప్పటికీ, తెలంగాణలోని గ్రామాల నుండి హైదరాబాద్‌తో పాటు ఇతర నగరాలు, పట్టణాలకు వచ్చి నివాసం ఉంటున్న వారిలో 80 శాతం పండుగకోసం తిరిగి గ్రామాలకు వెళ్లడం లేదు.
దాంతో పట్ణణాల్లోనే పండుగ చేసుకుంటున్నారు. ఈ కారణంగానే ఇప్పుడు పట్ణణాల్లో కూడా సంక్రాంతి శోభ కనిపిస్తోంది. దాంతో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు, వారి తరఫున ప్రచారంలో పాల్గొంటున్న ముఖ్యనేతలు, కార్యకర్తలు సంక్రాంతి సంబురాలను వదిలివేసి ఉదయం నుండి సాయంత్రం వరకు తిరగాల్సి వస్తోంది. వీరంతా ప్రస్తుతం మున్సిపోల్స్ ప్రచారంలో బిజీ బిజీగా కనిపిస్తున్నారు.