తెలంగాణ

రాహుల్‌ను తెలంగాణలో అడుగు పెట్టనీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 20: మహాత్మా గాంధీని ఆర్‌ఎస్‌ఎస్ హత్య చేసిందని ఆరోపించిన ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకుని, క్షమాపణ చెప్పేవరకు ఆయన్ను తెలంగాణలో అడుగు పెట్టనీయమని బిజెపి శాసనసభాపక్షం ఉప నాయకుడు ఎన్‌విఎస్‌ఎస్ ప్రభాకర్ హెచ్చరించారు. గాంధీని హత్య చేసిన నాథురామ్ గాడ్సెతో ఆర్‌ఎస్‌ఎస్‌కు ఎటువంటి సంబంధం లేదని ఎమ్మెల్యే ప్రభాకర్ బుధవారం విలేఖరుల సమావేశంలో తెలిపారు. లోగడ కాంగ్రెస్ నాయకుడు అర్జున్ సింగ్ కూడా ఇటువంటి ఆరోపణ చేస్తే ఆయనపై పరువు నష్టం దావా కేసు వేయడం జరిగిందని, ఆయన మరణించడంతో కేసు కొట్టి వేయడం జరిగిందని అన్నారు. అంతకు ముందు ఎఐసిసి సీనియర్ నాయకుడు సీతారాం కేసరి కూడా ఇలాగే వ్యాఖ్యానించి, చివరకు ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో క్షమాపణ చెప్పారని ఆయన గుర్తు చేశారు. గాంధీ హత్యతో ఆర్‌ఎస్‌ఎస్‌కు సంబంధం లేదని లోగడ కేసరి చెప్పారని ఆయన తెలిపారు. ఆర్‌ఎస్‌కు సంబంధం లేదని లోగడ వివిధ విచారణలు, కమిటీల నివేదికల్లో వెల్లడైందని ఎమ్మెల్యే ప్రభాకర్ చెప్పారు. స్వార్థ ప్రయోజనాల కోసం బిజెపిని, ఆర్‌ఎస్‌ఎస్‌ను అల్లరిపాలు చేయాలని రాహుల్ ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. రాహుల్ గాంధీ తన ఆరోపణను ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో తెలంగాణలో అడుగు పెట్టనీయమని ఆయన హెచ్చరించారు.
రైతులకు రుణ విముక్తి కలిగించండి: కాంగ్రెస్
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూలై 20: రైతులను రుణ విముక్తులను చేయాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ గండ్ర వెంకట రమణారెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మూడో విడత రుణ మాఫీ చేయకపోవడంతో రైతులకు కొత్తగా రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు తిరస్కరిస్తున్నాయని ఆయన బుధవారం విలేఖరుల సమావేశంలో తెలిపారు. అవసరమైతే ప్రభుత్వం కౌంటర్ గ్యారంటీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఎంసెట్ (మెడిసిన్) పేపర్ లీకేజీ వ్యవహారంపై సిబిఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. లీకేజీ నిజమైతే కారకులైన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని, తిరిగి పరీక్ష నిర్వహించాలని గండ్ర డిమాండ్ చేశారు.