తెలంగాణ

ఐదేళ్లలో 230 కోట్ల మొక్కలు.. ఉద్యమంలా హరితహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, జూలై 20: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో ప్రజలంతా భాగస్వాములై ఉద్యమంలా చేపట్టాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి, అటవీశాఖ మంత్రి జోగు రామన్న, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీరా చందులాల్‌తో కలిసి బుధవారం వరంగల్ జిల్లా మేడారంలో జరిగిన హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేడారంలోని పలు ప్రాంతాలలో, మేడారం సమ్మక్క, సారలమ్మ గద్దెల వద్ద మొక్కలు నాటారు. అనంతరం కడియం శ్రీహరి మాట్లాడారు. మొక్కలు నాటడమే కాదు.. నాటిన మొక్కలను సంరక్షించి భవిష్యత్ తరాలకు అందించాలని ఆయన పిలుపునిచ్చారు. వచ్చే ఐదు సంవత్సరాలలో రాష్ట్రంలో 230 కోట్లు మొక్కలు నాటే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు పోతుందని అన్నారు. అంతే కాకుండా రాష్ట్రంలో ప్రతి ఏటా 46 కోట్ల మొక్కలు నాటే లక్ష్యంగా ఎంచుకున్నామని అన్నారు. పోరాడి సాధించిన తెలంగాణ అభివృద్ధికి గడిచిన రెండేళ్లలో ముఖ్యమంత్రి కెసిఆర్ అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి అమలు చేస్తున్నారని అన్నారు. సరైన వర్షాలు కురవక చెరువులు నిండక రైతులు, ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అడవులు అంతరించి పోవడం వల్లే పర్యావరణ సమతుల్యం దెబ్బతిన్నదని, పర్యావరణ సమతుల్యం కాపాడేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ హరితహార కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు. హరితహారం, మిషన్ కాకతీయ, మిషన్‌భగీరథ, ఆసరా పెన్షన్‌లు సంక్షేమ పథకాలపై అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలతోపాటు దేశ ప్రధానే ముఖ్యమంత్రి కెసిఆర్‌ను అభినందిస్తున్నారంటే అది ఎంత గొప్ప కార్యక్రమమో అర్థం చేసుకోవాలన్నారు. ప్రతి ఇంటికి తాగునీరు అందించేందుకు 46 వేల కోట్లతో మిషన్ భగీరథ చేపట్టిన పనులు కొనసాగుతున్నాయన్నారు. అదేవిధంగా చెరువుల పునరుద్ధరణ, తూముల మరమ్మతుకు చేపట్టిన మిషన్ కాకతీయను ప్రపంచవ్యాప్తంగా హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్ గద్దెల పద్మ, జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ పాల్గొన్నారు.

వరంగల్ జిల్లా మేడారం గద్దెల వద్ద మొక్కలు నాటుతున్న
డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి, మంత్రి జోగు రామన్న