తెలంగాణ

ఉద్యోగులకు త్వరలో పీఆర్‌సీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఉద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు త్వరలోనే పీఆర్‌సీ ప్రకటించి వయో పరిమితిని పెంచనున్నట్టు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఆర్థిక మాంద్యం ప్రభావం రాష్ట్రంపై కూడా పడడంతో ఎన్నికల్లో ఇచ్చిన కొన్ని హామీలను అమలు చేయడంలో జాప్యానికి కారణమన్నారు. ఆర్థిక మాంద్యం వల్ల రాష్ట్రంలో ఆదాయం పూర్తిగా పడిపోయిందని ఆయన చెప్పారు. రాష్ట్ర ఆదాయం 21 శాతం నుంచి 9 శాతానికి తగ్గిందని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడిన సందర్భంగా తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. ఆదాయాన్ని పెంచుకోవడానికి వచ్చే ఆర్థిక సంవత్సరంలో స్వల్పంగా పన్నులు పెంచక తప్పని పరిస్థితి ఏర్పడిందన్నారు. మున్సిపాలిటీల్లో, గ్రామ పంచాయతీల్లో పన్నులు పెంచబోతున్నట్టు ఆయన చెప్పారు. గ్రామ పంచాయతీలకు ప్రతి నెలా 339 కోట్లు ఇస్తున్నట్టు తెలిపారు. మున్సిపాలిటీలకు కూడా ప్రతి నెలా రూ. 2 వేల కోట్లు ఇస్తామన్నారు. ఇంత పెద్ద ఎత్తున నిధులు ఇస్తున్నప్పుడు పన్నులు పెంచకపోతే ఎలా అని సీఎం ప్రశ్నించారు. రైతు సమన్వయ సమితిని బలోపేతం చేసి రైతులను సంఘటితం చేయడానికి రూ. 300 కోట్లతో నిధిని ఏర్పాటు చేస్తామన్నారు. తాను పండించిన పంటలకు రైతే ధర నిర్ణయించే పరిస్థితి తీసుకువస్తామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 57 సంవత్సరాలు నిండి అర్హులైన వృద్ధులకు నెలకు రూ.2,016 పెన్షన్ ఇస్తామని అన్నారు. దీనిని వచ్చే ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి
అమలు చేస్తామన్నారు. నిరుద్యోగ భృతి ఇవ్వనున్నట్టు ఎన్నికల్లో హామీ ఇచ్చినప్పటికీ విధివిధానాలపై ఇంకా
అధ్యయనం చేయలేదన్నారు. పైగా ఆర్థిక మాంద్యం తోడు కావడంతో కనీసం వచ్చే ఏడాది ఆర్థిక సంవత్సరమైనా అమలు చేస్తామన్నారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తికావడంతో త్వరలోనే దుమ్ముగూడెం బ్యారేజికి శంకుస్థాపన చేయనున్నట్టు ఆయన తెలిపారు. ఈ బ్యారేజికి 40 టీఎంసీల నీటి నిలువ సామర్థ్యం ఉంటుందన్నారు. పల్లె ప్రగతి స్ఫూర్తి విజయవంతం అయినట్టుగానే త్వరలోనే పట్టణ ప్రగతిని చేపడతామన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొస్తామన్నారు. అవినీతిలో రెవెన్యూ శాఖ అగ్రస్థానంలో ఉన్నట్టు ఒక సర్వేలో తేలిందన్నారు. ఎమ్మార్వో ఆఫీసులకు పెట్రోల్ డబ్బాలతో వెళ్లే పరిస్థితి ఎందుకు వచ్చిందో ఆ శాఖ ఉద్యోగులు ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. కొత్త చట్టం తీసుకొచ్చే ముందు ఆ శాఖ ఉద్యోగులతో కూడా చర్చిస్తామన్నారు. మంచి మాట వింటే సరి, లేకపోతే ఇతర శాఖలకు బదలాయిస్తామని కేసీఆర్ హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల అంశంపై ప్రశ్నించగా అది ఆ రాష్ట్ర అంతర్గత విషయమని సీఎం కేసీఆర్ తోసిపుచ్చారు.
'చిత్రం...ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు