తెలంగాణ

ఢిల్లీ షహీన్‌బాగ్ ఉద్యమం ఆదర్శనీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 25: ఎన్‌ఆర్‌సీ, సీఏఏ, ఎన్‌పీఆర్‌లకు వ్యతిరేకంగా ఢిల్లీ షహీన్‌బాగ్‌లో గత 42 రోజులుగా జరుగుతున్న ఉద్యమం దేశానికే ఆదర్శనీయమని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ పేర్కొన్నారు. నారాయణతో పాటు జాతీయ సమితి సభ్యులు డాక్టర్ ఖాన్ షహీన్‌బాగ్ నిరసన శిబిరాలను సందర్శించారు.ఈ మేరకు నారాయణ హైదరాబాద్‌లో ఒక ప్రకటన విడుదల చేశారు. ఢిల్లీ యమునా నది ఒడ్డునున్న షహీన్‌బాగ్‌లో దాదాపు 42 రోజులుగా రాజకీయాలకు అతీతంగా ఎన్‌ఆర్‌సీ , సీఏఏ, ఎన్‌పీఆర్ వద్దంటూ ఆందోళనలు కొనసాగిస్తున్నారని అన్నారు. రోజుకు పది వేలపై బడి జనం స్వచ్చందంగా ఈ నిరసన శిబిరాల్లో పాల్గొంటున్నారని అన్నారు. సీపీఐ జాతీయ ప్రధానకార్యదర్శి డీ రాజా, ఎఐటీయూసీ జాతీయ ప్రధానకార్యదర్శి అమర్‌జిత్ కౌర్ , సీపీఎం ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరి, బృందా కారత్, కాంగ్రెస్ నేత రవిశంకర్ వంటి అనేక మంది ఈ శిబిరాలను సందర్శించి, ఉపన్యసించారని అన్నారు. రాజకీయాలను పక్కన పెట్టి ప్రజలు అంతా సమైక్యంగా ఈ నిరసనలు చేపట్టారని, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరిని తప్పుపడుతున్నారని అన్నారు. ఎన్‌ఆర్‌సీ , సీఏఏ, ఎన్‌పీఆర్‌లను ఉపసంహరించుకోవాలని వారు కోరుతున్నారని మా దేహం ముక్కలైనా, దేశాన్ని ముక్కలు కానివ్వం అంటూ వారు చెబుతున్నారని అన్నారు. సుదీర్ఘకాలం ఇంత పెద్ద ఉద్యమం రాజకీయాలకు అతీతంగా సాగడం అభినందనీయమని అన్నారు. షహీన్‌బాగ్ ఉద్యమం అంతర్జాతీయంగా ఆకర్షితమైందని ఈ ఉద్యమం ఆదర్శప్రాయంగా నిలిచిందని అన్నారు.