తెలంగాణ

కోమటిరెడ్డి అనిల్ ఇళ్లలో సోదాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, జూలై 21: సిఎల్పీ ఉపనేత, నల్లగొండ శాసన సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సోదరుడైన కాంట్రాక్టర్ కోమటిరెడ్డి అనిల్‌రెడ్డి ఆస్తుల తనిఖీ నిమిత్తం ఐటి శాఖ గురువారం ఆకస్మిక దాడులు నిర్వహించింది.
అనిల్‌రెడ్డి ఆదాయ పన్ను శాఖకు సక్రమంగా పన్నులు చెల్లించడం లేదని గుర్తించిన ఐటి శాఖ అధికారులు ఆరు బృందాలుగా ఏర్పడి అనిల్‌రెడ్డికి చెందిన హైద్రాబాద్, కాకినాడ, ప్రశాస్‌నగర్, నల్లగొండ, నార్కట్‌పల్లి మండలం బ్రాహ్మణ వెల్లంలలోని నివాసాలు, ఫాంహౌజ్‌లలో ఏకకాలంలో సోదాలు ని ర్వహించి పలు ఆస్తులకు సంబం ధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
బ్రాహ్మణ వెల్లంలలో కోమటిరెడ్డి బ్రదర్స్ ఫాంహౌజ్‌లో, నల్లగొండలోని సోదరుల ఇళ్లలో సైతం ఐటి శాఖ బృందాలు సోదాలు చేసి వెళ్లాయి. ఇటీవల కాంగ్రెస్ నుండి టిఆర్‌ఎస్‌లో చేరిన ఎంపి గుత్తా వైఖరిని తప్పుబడుతూ, సీఎం కెసిఆర్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో కోమటిరెడ్డి బ్రదర్స్ విమర్శల దాడి చేస్తున్నారు. ఈ నేపధ్యంలో తాజాగా కోమటిరెడ్డి బ్రదర్స్ ఆస్తులపై ఐటి దాడులు జరుగడం రాజకీయంగా కూడా చర్చనీయాంశమైంది.