తెలంగాణ

సాగుకు సాంకేతిక మేళవింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఆధునిక సాంకేతిక విజ్ఞానాన్ని వ్యవసాయ రంగంలో పూర్తిగా వినియోగించుకోవాలని, పంటల ఉత్పత్తులు గణనీయంగా పెరిగేలా చూడాలని రాష్ట్ర వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో మంగళవారం జరిగిన ‘డిజిటల్ ఏజీ ఇండియా కాన్ఫరెన్స్’లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పంటల ఉత్పత్తులను కూడా పెంచాల్సి ఉందన్నారు. భూమి విస్తీర్ణం యథాతథంగా ఉంటుందని, నీటి లభ్యత తక్కువగానే ఉంటుందని, ఈ వనరులను పూర్తిస్థాయిలో వినియోగించుకుంటూ పంటల ఉత్పత్తులను మాత్రం గణనీయంగా పెంచాలని సూచించారు. పట్టణీకరణ
పెరుగుతోందని, వ్యవసాయ భూములు వాణిజ్య అవసరాలకు ఎక్కువగా వాడాల్సి వస్తోందని, అందువల్ల పట్టణాలు, నగరాల పరిసరాల్లో దాదాపు 100 కిలోమీటర్ల వరకు వ్యవసాయం నిలిచిపోతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు జాతీయ, అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తున్నాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వస్తున్న సాంకేతిక విజ్ఞానం రైతులు అందిపుచ్చుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. వ్యవసాయ రంగంలో మొబైల్ రిమోట్ సెన్సింగ్ కంప్యూటర్లు కొంతవరకు ఉపయోగపడుతున్నాయన్నారు. మొబైల్ ఫోన్లను కూడా సేద్యం రంగానికి ఉపయోగించుకోవాలన్నారు. వ్యవసాయ రంగం అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని, అందుకే ఆధునిక సాంకేతిక విజ్ఞానం మరో విప్లవాన్ని సృష్టించాల్సిన అవసరం ఉందన్నారు. రైతులకు ఆధునిక విజ్ఞానాన్ని చేరువ చేసేందుకు ప్రభుత్వం కూడా ప్రయత్నిస్తోందన్నారు. ఈ సమావేశంలో ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ప్రవీణ్‌రావు, ఐటీసీ డైరెక్టర్ శివకుమార్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ప్రొఫెసర్ అశ్వినీ ఛాత్రే, జినేష్‌షా తదితరులు పాల్గొన్నారు.

*చిత్రం...హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో మంగళవారం జరిగిన డిజిటల్ ఇండియా కాన్ఫరెన్స్‌ను ప్రారంభిస్తున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి