తెలంగాణ

ఉగ్రవాదులకు సంఘీభావం తెలిపిన వారిని అరెస్టు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ఖైరతాబాద్, జూలై 21: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో ఉగ్రవాదులకు సంఘీభావం తెలిపిన వారిని అరెస్టు చేసి శిక్షించాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో విహెచ్‌పి రాష్ట్ర అధ్యక్షుడు రామరాజు మాట్లాడుతూ దేశ విచ్ఛిన్నాన్ని కోరుకున్న ఉగ్రవాది బూర్హాన్ వనీకి హెచ్‌సియూలో సంఘీభావం తెలపడం దారుణమన్నారు. విద్యార్థులు ఉండాల్సిన హెచ్‌సియూలో ఉగ్రవాదుల ఉన్నారేమోనన్న అనుమానం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో అఫ్జల్‌గురు, వికారుద్దీన్ లాంటి వారు మృతిచెందినప్పుడు కూడా అనుకూల నినాదాలు చేయడం విడ్డూరమన్నారు. లక్షలమంది అమాయకుల ప్రాణాలను బలిగొంటున్న ఉగ్రవాద అనుకూల నినాదాలు క్యాంపస్‌లో వద్దని వారించిన విద్యార్థులను చితకబాదుతుంటే ఇక్కడి ప్రభుత్వం పట్టించుకోక పోవడం సిగ్గుచేటన్నారు. విద్యార్థుల ముసుగులో యూనివర్శిటీలో ఆశ్రయం పొందుతున్న ఉగ్ర సానుభూతిపరులను వెంటనే పంపించి వేయాలన్నారు.