తెలంగాణ

సమష్టి కృషితో ఆర్టీసి పటిష్ఠం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 21: నష్టాల్లో కూరుకుపోయిన ఆర్టీసిని సమష్టి కృషితో పటిష్ఠం చేసి రవాణా వ్యవస్థను బలోపేతం చేద్దామని, ఆర్టీసిని లాభాల బాటలో నడిపించేందకు అహర్నిషలు కృషి సల్పుతున్న కార్మికులను కన్న బిడ్డలుగా చూద్దామని తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజన తరువాత తొలిసారిగా జరిగిన ఆర్టీసి గుర్తింపు సంఘాల ఎన్నికల్లో టిఎంయూ ఘన విజయం సాధించిన నేపథ్యంలో సంఘం ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ థామస్ రెడ్డి గురువారం మంత్రిని కలిసి విజయోత్సవ సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ గత పాలకులు ఆర్టీసిని నిర్లక్ష్యం చేసి కార్మికుల ప్రయోజనాలను పట్టించుకోలేదని ఆరోపించారు. ఉద్యమానికి అండగా నిలిచిన ఆర్టీసి కార్మికులకు ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నారన్నారు. ఆర్టీసి నష్టాల్లో ఉన్నప్పటికీ కార్మికులకు ఎలాంటి నష్టం జరుగకుండా కార్మికుల శ్రేయస్సుకు కట్టుబడి ఉన్నారన్నారు. ఆర్టీసిని దేశంలో ఎక్కడా లేనివిధంగా తీర్చిదిద్దుతామని త్వరలో 1200 కొత్త బస్సులు వస్తున్నాయని, కార్మికులకు 44 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చి గౌరవించారని ఆయన గుర్తుచేశారు. టిఎంయూ గెలుపు ఆర్టీసి అభివృద్ధికి మరింత తోడ్పడుతుందని, ఆర్టీసి ఆధునికీకరణకు ముందుగా బస్‌స్టాండ్లు, డిపోలలో మంచినీటి సదుపాయం, సిసి రోడ్లు, ప్లాట్‌ఫారాల విస్తరణ, మరుగుదొడ్లు నిర్మించేందుకు రూ. 32 కోట్లు కేటాయించామని మంత్రి వెల్లడించారు. రానున్న రోజుల్లో అన్ని గ్రామాలకు బస్సులు నడుపుతామన్నారు. ఆర్టీసి దేశంలోనే ఆదర్శంగా నిలుస్తుందన్నారు.

చిత్రం.. మంత్రి మహేందర్‌రెడ్డిని సత్కరిస్తున్న టిఎంయు నేత అశ్వత్థామరెడ్డి తదితరులు