తెలంగాణ

అయ్యప్ప ఆలయం సీజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, జూలై 21: కోర్టు ఆదేశాల మేరకు నెల రోజుల కిందట సీజ్ చేసిన వరంగల్ నగరంలోని అయ్యప్ప ఆలయం వివాదాస్పదంగా మారింది. ఆలయాన్ని ఎండోమెంట్ అధికారులు సీజ్ చేయడం పట్ల ఆలయ నిర్వాహకులు సుబ్రహ్మణ్యస్వామి, ఆయన కుటుంబ సభ్యులు కోర్టును ఆశ్రయించగా గురువారం నుండి తిరిగి ఆలయ నిర్వాహకులే యధావిధిగా పూజలను జరుపుకోవచ్చని కోర్టు స్టే ఇచ్చింది. కోర్టు స్టేతో ఆలయ నిర్వాహకులు ఎండోమెంట్ కార్యాలయానికి రాగా అక్కడ ఎండోమెంట్ అధికారులు దేవాలయ తాళాలు ఇవ్వడంలో జాప్యం చేయడంతో మనస్తాపానికి గురైన ఆలయ అర్చకుడు తనను అధికారులు ఉద్ధేశపూర్వకంగా వేధింపులకు గురిచేస్తున్నారంటూ దేవాదాయ శాఖ కార్యాలయం ముందే ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో దేవాదాయశాఖ అధికారులు అర్చకునికి గుడి తాళాలు అప్పగించడంతో పరిస్థితులు సద్దుమనిగాయి. యధావిధిగా గుడిలో పూజలు కొనసాగుతున్నాయి.

చిత్రం.. ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్న పూజారి