తెలంగాణ

ఉస్మానియా డిగ్రీ ఫలితాల్లో గందరగోళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 8: ఉస్మానియా యూనివర్శిటీ ప్రకటించిన యుజీ సెమిస్టర్ ఫలితాల్లో అనేక అవకతవకలు జరిగాయని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఫలితాల్లో అనేక అవకతవకలు జరిగాయని వారు ఆరోపించారు. పరీక్షలు రాసినా రాయలేదని, పరీక్షలు బాగా రాసిన వారి ఫలితాలు కూడా గల్లంతయ్యాయని, చాలా తక్కువ మార్కులు వచ్చాయని వారు పేర్కొంటున్నారు. దూరవిద్య కేంద్రం ద్వారా నిర్వహించిన ఎంఏ సైకాలజీ పరీక్షల్లో సైతం జరిగిన గందరగోళం నుండి విద్యార్థులు ఇంకా నేటికీ తేరుకోలేదు. ఎక్కువ మార్కులు వస్తాయని ఎదురుచూసిన విద్యార్థులకు ఆశాభంగం ఎదురుకాగా, ఫలితాలు ప్రక్రియలో గందరగోళం జరిగినట్టు వారు ఆరోపించారు. అదే పరిస్థితి యుజీ తొలి సెమిస్టర్, మూడో సెమిస్టర్, ఐదో సెమిస్టర్ ఫలితాల్లోనూ జరిగిందని వారు పేర్కొన్నారు. నిరంతరం పరీక్షలను వాయిదా వేయడం, ఫలితాల్లో తీరని జాప్యం చేయడం ఇంత జరిగాక చూస్తే అనుకున్నట్టు ఫలితాలు ఉండటం లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. డిగ్రీ ఫలితాలలో తప్పిదాలను ప్రశ్నించడానికి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్శిటీ ఎగ్జామినేషన్ బ్రాంచిని ముట్టడించినట్టు వారు చెప్పారు. ఈ సందర్భంగా హైదరాబాద్, సికింద్రాబాద్ విభాగాల్లోని పలు కాలేజీల నుండి విద్యార్థులు యూనివర్శిటీకి తరలివచ్చారు. కంట్రోలర్‌కు ఈ ఇబ్బందులను వారు వివరించగా, ఆయన సానుకూలంగా స్పందించలేదని విద్యార్థులు ఆరోపించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ హైదరాబాద్ విభాగ్ కన్వీనర్ కమల్ సురేష్ మాట్లాడుతూ కంట్రోలర్, యూనివర్శిటీ ఎగ్జామినేషన్ సిబ్బంది బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని , విద్యార్థులకు కంట్రోలర్ జరిగిన తప్పిదాలకు సమాధానం చెప్పాలని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నేతలు జీవన్, అజయ్, శిరీష తదితరులుపాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు పెద్ద పెట్టున నినదిస్తూ కంట్రోలర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అయితే ఇంతలోగా రిజిస్ట్రార్ అక్కడికి చేరుకోవడంతో ప్రతి విద్యార్థికీ న్యాయం చేస్తామని ఆయన చెప్పారు. ఎవరూ ఎలాంటి తొందరపాటు పనులకు పాల్పడవద్దని ఆయన హితవు పలికారు. సిబ్బంది పొరపాటు ఉంటే వారిపై చర్యలు తప్పవని రిజిస్ట్రార్ హామీ ఇచ్చారు.