తెలంగాణ

సైబర్ నేరాల నిరోధంపై జాతీయ శిక్షణ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 11: బాలలు, మహిళలపై జరుగుతున్న సైబర్ నేరాల నిరోధానికి యునిసెఫ్ ఆధ్వర్యంలో న్యూ ఢిల్లీలో జాతీయ స్థాయిలో నిర్వహించిన పిల్లలు, మహిళలపై జరుగుతున్న సైబర్ నేరాల నిరోధంపై జరిగిన సదస్సుకు హైదరాబాద్ షీ టీమ్స్ ఇన్‌స్పెక్టర్ సునీత, వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఇన్‌స్పెక్టర్ డీ.విశే్వశ్వర్‌లకు ఆహ్వానం లభించింది. అంతర్జాతీయ సెఫ్ ఇంటర్నెట్ డేను పురస్కరించుకొని న్యూఢిల్లీ జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో సదస్సును నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన పోలీసు అధికారులకు ప్రత్యేక శిక్షణనిచ్చారు. మాస్టర్ ట్రైనర్ల శిక్షణకు ఇన్‌స్పెక్టర్లు సునీత, విశే్వశ్వర్‌లను డీజీపీ పోలీస్ విభాగం ఎంపిక చేసి సదస్సుకు పంపించింది. శిక్షణా కార్యక్రమానికి తమను ఎంపిక చేయడం పట్ల డీజీపీకి సునీత, విశే్వశ్వర్‌లు కృతజ్ఞతలు తెలిపారు.